ప్రాంతీయం

ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులుగా ఏకగ్రీవం…

216 Views

ముస్తాబాద్, జనవరి 22 (24/7న్యూస్ ప్రతినిధి): ముస్తాబాద్ మండలంలో (ఎంఆర్పిఎస్) మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి మండల అధ్యక్షులుగా తెర్లుమద్ది గ్రామానికి చెందిన కొమ్మెట రాజు మాదిగను మండలంలోని అన్ని గ్రామాల సంగసభ్యుల సమావేశంలో ఏకగ్రీవంగా మండల అధ్యక్షుడిగా నియమితులయ్యారు. ఈ సందర్భంగా కొమ్మెట రాజు మాట్లాడుతూ ఎమ్మార్పీఎస్ ఉద్యమం ఏర్పడిన తర్వాతనే మాదిగ జాతికి ఆత్మగౌరవం గుర్తింపు వచ్చిందన్నారు. మన మాదిగల హక్కులు మనకు సాధించేవరకు ముందస్తు లక్ష డబ్బులు, వేయి గొంతుకలు కార్యక్రమంలో భాగంగా పోరాడుదామన్నారు. ఈ కార్యక్రమంలో మండల సంఘాల తరఫున నిరంతరం పోరాడుతూ నన్ను నియమించిన మండల సభ్యులకు ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో మాదిగలు రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు మండల నాయకులు పాల్గొన్నారు.

Oplus_131072
Oplus_131072
కస్తూరి వెంకట్ రెడ్డి ఆంధ్రప్రభ ముస్తాబాద్