ముస్తాబాద్, మార్చి 5 (24/7న్యూస్ ప్రతినిధి): గతకొన్ని నెలలుగా ముస్తాబాద్ మండలంలోని చుట్టుపక్క గ్రామాలైన గూడూరు, మఱైపల్లె గ్రామాలలో తాళం వేసిన ఆలయాలలో చొరబడి హుండీలో నుండి డబ్బులు, విగ్రహాలపై ఉన్న విలువైన వస్తువులను అపహరించి వాటిని అమ్ముకొని సొమ్ము చేసుకుని వచ్చిన సొమ్ముతో జలసాలకు పాటుపడుతూ దొరికిన దొంగ తెర్లుమద్ది గ్రామానికి చెందిన మామిండ్ల ఆంజనేయులు అలియాస్ (అంజి) తండ్రి/ పెంటయ్య బుధవారం రోజున ముస్తాబాద్ శివారులోని ఏఎంఆర్ వివాహ మండపం సమీపంలో పట్టుకొని కారాగారంకు తరలించామని ముస్తాబాద్ ఎస్సై చిందం గణేష్ తెలిపారు.




