Breaking News నేరాలు ప్రాంతీయం

గడ్డి మందు సేవించిన వ్యక్తి మృతి…

274 Views

గడ్డి మందు సేవించిన వ్యక్తి మృతి..
గడ్డి మందు సేవించి ఆత్మహత్యాయత్నం చేసుకున్న సిరిపురం ముత్తయ్య (65) నిన్న అర్ధరాత్రి చికిత్స పొందుతూ మరణించాడు. ఎల్లారెడ్డిపేట మండలం నారాయణపూర్ గ్రామానికి చెందిన సిరిపురం ముత్తయ్య తన పొలం వద్ద గడ్డి మందు సేవించి అపస్మారక స్థితిలోకి వెళ్ళగా సమాచారం అందుకున్న కుటుంబ సభ్యులు వెంటనే ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని ఓ స్థానిక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించినప్పటికీ ముత్తయ్య ప్రాణాలు దక్కలేదు. సమాచారం తెలుసుకున్న మండల మున్నూరు కాపు సంఘం అధ్యక్షులు నందికిషన్ వెంటనే ఆసుపత్రికి చేరుకొని చికిత్సకు సంబంధించి వైద్యులను మెరుగైన వైద్యం అందించాలని కోరినప్పటికీ ప్రాణాలు కోల్పోయాడు. మృతునికి భార్యా పిల్లలు ఉన్నారు.పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Oplus_131072
Oplus_131072
కొండ్లెపు జగదీశ్వర్ జర్నలిస్ట్ ఎల్లారెడ్డిపేట్