మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కన్నుమూత.
దిల్లీ: కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ (92) కన్నుమూశారు. తీవ్ర అస్వస్థతకు గురై దిల్లీ ఎయిమ్స్‌లో చేరిన ఆయన చికిత్స పొందుతూ గురువారం రాత్రి తుదిశ్వాస విడిచారు.దేశంలో ఎన్నో ఆర్థిక సంస్కరణలు చేపట్టిన వ్యక్తిగా నిలిచిన మన్మోహన్ సింగ్ అక్టోబర్ 1991లో తొలిసారి రాజ్యసభలో అడుగుపెట్టారు. 1991 నుంచి 1996 వరకు పీవీ నరసింహారావు ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా పని చేసిన ఆయన.. ఆ తర్వాత 2004 నుంచి 2014 వరకు పదేళ్ల పాటు భారత ప్రధానిగా సేవలందించారు. దేశాన్ని సుదీర్ఘకాలంపాటు పాలించిన ప్రధానుల్లో ఒకరిగా నిలిచారు.
మన్మోహన్ సింగ్ కుటుంబ వివరాలు.
పుట్టిన తేదీ: 26 సెప్టెంబరు 1832
జన్మస్థలం: మా, పంజాల్ (ప్రస్తుతం పాకిస్థాన్‌లో ఉంది).
వివాహం: 14 సెప్టెంబరు 1958
కుటుంబం: భార్య గురుశరణ్ కౌర్ కుమార్తెలు ఉపేందర్, మన్ అమృత్
చదువు: పంజాబ్ విశ్వవిద్యాలయం నుంచి ఆర్థిక శాస్త్రంలో 1952లో బీఏ, 1954లో ఎంఏ పట్టా
కేంబ్రిడ్జ్ నుంచి ఆర్థిక శాస్త్రంలో ట్రైపోస్
ఆక్స్‌ఫర్డ్ నుంచి ఎం.ఎ. డి.ఫిల్ (1962)
హోనరిస్ కాసా నుంచి డి.లిట్
1982-85 మధ్య ఆర్బీఐ గవర్నర్‌గా పనిచేశారు.
1991-96 మధ్య పీవీ నరసింహారావు హయాంలో ఆర్థిక మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు.
ప్రధాని పీఠాన్ని అధిష్టించిన తొలి హిందూయేతర వ్యక్తిగా మన్మోహన్ రికార్డు .
మన్మోహన్ సింగ్ హయాంలో అత్యధిక జీడీపీ (10.2శాతం) వృద్ధిరేటు నమోదైంది.
మన్మోహన్ హయాంలోనే వెనుకబడిన వర్గాలకు 27శాతం సీట్ల కేటాయింపు జరిగింది.
1987లో మన్మోహన్‌కు పద్మవిభూషణ్ ప్రదానం చేశారు.
