ముస్తాబాద్, డిసెంబర్ 26 (24/7న్యూస్ ప్రతినిధి): మండల పరిధిలోని రామలక్ష్మణపల్లె గ్రామంలో పోలీసు అధికారులు చేరుకొని సీసీ కెమెరాల ఏర్పాటు, రోడ్డు ప్రమాదాలు, కుల నిషేధం, సైబర్ నేరాలుపట్ల పలు అంశాలపై చర్చించి సంబంధిత కాలనీ వాసులను గురువారం సాయంకాలం గ్రామంలో సమావేశం ఏర్పరిచి గ్రామ ప్రజలకు పలు అంశాలపై చర్చించి అవగాహన కల్పించారు. హెల్మెట్ లేని ప్రయాణం, నెంబర్ ప్లేట్లు లేని వాహనం, డ్రైవింగ్ లైసెన్ తో పాటు మైనర్లకు వాహనం ఇస్తే వాహనం సీజ్ చేసి వాహన యజమానులపై కేసు నమోదు చేస్తామని పేర్కొన్నారు. పైవన్నీ ముందస్తు విధివిధానాలు ప్రజలను భయభ్రాంతులకు గురిచేయాలను కాదు సమ సమాజం చైతన్యం పెంపొందించాలని తపన కొరకే అవలంబిస్తున్నామన్నారు. ప్రజలకు గ్రామాలలో చట్టవ్యతిరేక కార్యకలాపాలు, బ్లాక్ మ్యాజిక్‌పై అవగాహన కల్పించేందుకు నేరాలపట్ల సిఐ మొగిలి, ఎస్ఐ సిహెచ్. గణేష్ చర్చించారు. అక్రమమార్గంలో డబ్బులు సంపాదించుట ప్రజలను ప్రలోభపెట్టే లోబర్చుకునుట అంశాలపై విధశాఖలలో పోలీస్ అధికారులు నిఘా ఎప్పటికప్పుడు నిగా ఉంటుందన్నారు. యువత తల్లిదండ్రులకు బాసటగా నిలవాలేతప్ప భారం కాకూడదని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు పోలీస్ అధికారులు పాల్గొన్నారు.
