ప్రాంతీయం

బుద్ధ పౌర్ణమి సందర్భంగా చాకేపల్లిలో అంబేడ్కర్ విగ్రహ ఆవిష్కరణ

28 Views

మంచిర్యాల జిల్లా,చెన్నూరు నియోజకవర్గం.

బుద్ధ పౌర్ణమి సందర్భంగా చాకేపల్లిలో అంబేడ్కర్ విగ్రహ ఆవిష్కరణ – ఎంపీ గడ్డం వంశీకృష్ణ.

మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి నియోజకవర్గం చాకేపల్లి గ్రామంలో బుద్ధ పౌర్ణమి సందర్భంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది.

ఈ కార్యక్రమంలో పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ, మంత్రి సీతక్క, బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఎంపీ గడ్డం వంశీకృష్ణ  మాట్లాడుతూ –బుద్ధ పౌర్ణమి రోజున అంబేడ్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించడం చాలా గర్వకారణం అంబేడ్కర్ ఆలోచనలను ముందుకు తీసుకెళ్లే సమయంలో, కేంద్ర మంత్రి అమిత్ షా చేసిన అనుచిత వ్యాఖ్యలకు క్షమాపణ కోరుతూ పోరాటం చేశాం. సింగరేణి కార్మికుల కోసం పార్లమెంటులో టన్నుకు రూ.20 పెంచాలని డిమాండ్ చేశాం. నేతకాని భవన నిర్మాణానికి ఎంపీ నిధుల నుంచి రూ.50 లక్షలు మంజూరు చేశాం అని అన్నారు.

బెల్లంపల్లి నియోజకవర్గంలో మొత్తం రూ.17.77 కోట్లతో రోడ్లను నిర్మించామని, బెల్లంపల్లి నుండి చాకేపల్లి వరకు రూ.2.45 కోట్ల బి.టి. రోడ్డుకు శంకుస్థాపన చేసినట్లు ఎంపీ  వివరించారు. ప్రజల అభివృద్ధికి కట్టుబడి పనిచేస్తామని ఆయన హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ దీపక్ కుమార్, స్థానిక నాయకులు, అధికారులు, పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.

Oplus_131072
Oplus_131072
జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్