ఆంగ్ల విద్యాభివృద్ధికి మంకు పట్టు
(గుండారం పాఠశాలలో మంకు రాజయ్య జయంతి వేడుకలు)
అక్షరానికి నోచుకోని మారుమూల పల్లెల్లో సైతం ఆంగ్ల విద్యను ప్రవేశ పెట్టిన ఘనత మంకు రాజయ్యదేనని రాచర్ల గుండారం పాఠశాల ప్రధానోపాధ్యాయులు గణాది శ్రీనివాస్ అన్నారు.
శనివారం గుండారం ప్రభుత్వ పాఠశాలలో ఎల్లారెడ్డిపేట పూర్వ మండల విద్యాధికారి మంకు రాజయ్య 52వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు
ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ, మారుమూల పల్లెల్లో సైతం ఆంగ్ల విద్య అభివృద్ధికి అహర్నిశలు కృషిచేసి, మండలానికి అంతర్జాతీయ ఖ్యాతి గాంచేలా కృషిచేసిన విద్యావేత్త మంకు రాజయ్యని అన్నారు.
ప్రభుత్వ పాఠశాలలపై ప్రజలకు నమ్మకం కోల్పోతున్న వేళ మండల విద్యాధికారిగా రాజయ్య ప్రభుత్వ పాఠశాలలో అనేక సంస్కరణలు తీసుకొచ్చారని, ప్రైవేటు కార్పోరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యలు నాణ్యత పెంచేందుకు విశేష కృషి చేశారని కొనియాడారు.
తల్లిదండ్రుల విద్యావేత్తల వివిధ రకాల స్వచ్ఛంద సంస్థల సహకారంతో పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేశారని, నేటి ఉపాధ్యాయులు, విద్యార్థులు వారి ఆశయ సాధనకు కృషి చేయాలని, మారుమూల పల్లెల్లో విద్యా నైపుణ్యాన్ని పెంపొందించాలని కోరారు. అంతకుముందు మంకు రాజయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి విద్యార్థులకు మిఠాయి పంపిణీ చేశారు.
కార్యక్రమంలో ఉపాధ్యాయులు పప్పుల శ్రీనివాస్, కులేరి ప్రేమ్ సాగర్, కవిత, అంజయ్య, వెంకటలక్ష్మి, పద్మ, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు
