ప్రాంతీయం

ఎర్రోళ్ల శ్రీనివాస్‌ అరెస్టు ను ఖండిస్తున్నాం

31 Views

-బిఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా ఇంచార్జి కొమ్ము నవీన్ కుమార్

తెలంగాణ ఉద్యమ కారుడు,ఉస్మానియా ఉద్యమ నేత ఎర్రోళ్ల శ్రీనివాస్ ను అరెస్ట్ చేయడం కేవలం కక్ష పూరిత రాజకీయమేనని,గజ్వేల్ నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా ఇంచార్జి కొమ్ము నవీన్ కుమార్ తీవ్రంగా ఖండించారు.నిత్యం రేవంత్ రెడ్డి ప్రభుత్వంకు వ్యతిరేకంగా తెలంగాణ రాష్ట్ర బాధ్యతగల ఎస్సీ ఎస్టి కమీషన్ ఛైర్మెన్ గా పనిచేసి అప్పటి నుండి ఇప్పట్టివరకు అన్ని విషయాల్లో పోరాటం చేస్తూ,ప్రజలతో పాటు దళిత గిరిజన సోదరులకు అండగా ఉంటున్నందుకు అన్యాయంగా,అక్రమంగా అరెస్టు చేశారన్నారు.ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా అరెస్ట్ చేయడం పూర్తిగా అప్రజాస్వామ్యమని అన్నారు.ఇది ఇందిరమ్మ రాజ్యమా,లేక పోలీస్ రాజ్యమా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.కాబట్టి రేవంత్ రెడ్డి ప్రభుత్వం కక్ష పూరిత చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని వారు తెలిపారు.

Oplus_131072
Oplus_131072
ఎర్రోళ్ల బాబు సిద్దిపేట జిల్లా ఇంచార్జ్