సువార్తను ప్రకటించడమే నిజమైన క్రిస్మస్
రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం అల్మాస్పూర్ గ్రామంలోని ఇండిపెండెంట్ పెంతుకోస్తు చర్చిలో ఆదివారం సండే స్కూల్ పిల్లలకు హైదరాబాదు నుంచి వచ్చిన పాస్టర్ పాలెన్ ఫ్రాన్సిస్ ఆధ్వర్యంలో క్రిస్మస్ గిఫ్ట్ లను అందజేశారు. ఈ సందర్భంగా పాస్టర్ పాలిన్ ట్రాన్సిస్ మాట్లాడుతూ క్రైస్తవుల హృదయాలలో పగ, ద్వేషం ఉండకూడదని ఏసుక్రీస్తు ప్రేమను పంచడానికి ఈ లోకంలో మానవతారునిగా జన్మించాడని ఆయన ప్రేమను వెల్లడిపరచడానికి కలవరి సిల్వలో మరణించేంత ఈ లోకంలో ఉన్న ప్రజలను మంచి మార్గంలో నడిపేందుకు ప్రేమించాడని అన్నారు, ఏసుక్రీస్తు జన్మదినం క్రిస్మస్ పండుగ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవులు సువార్తను ప్రకటించడమే నిజమైన క్రిస్మస్ అని అన్నారు. సండే స్కూల్ పిల్లలకు క్రిస్మస్ గిఫ్టులను పంపిణీ చేయడంతో సండే స్కూల్ పిల్లలు ఆనందం వ్యక్తం చేశారు, ఈ కార్యక్రమంలో పాస్టర్ కిషోర్ కుమార్, కల్పన, శార, సునీత, రోహిళ, ఆని, ఆర్డెన్, స్టీవెన్, ముని భాయ్, ఇస్సాక్, సంతోష, నతానియల్, దానియేలు గోవర్ధన్, సతీష్, అనూష, మహేశ్వరి, డేవిడ్, రజిత, పలువురు క్రైస్తవులు సండే స్కూల్ పిల్లలు తదితరులు పాల్గొన్నారు,
