రాయపోల్ మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులుగా మండలంలోని తిమ్మక్క పల్లి గ్రామానికి చెందిన యువ నాయకుడు దయాకర్ ఎన్నికయ్యాడు. రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు ఆన్లైన్ ద్వారా ఓటింగ్ నిర్వహించడంతో దయాకర్ విజయం సాధించారు. యూత్ కాంగ్రెస్ అధ్యక్ష పదవిలో రేసులో ముగ్గురు పోటీ పడగా ఎట్టకేలకు దయాకర్ అందరి సహకారంతో విజయం సాధించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి మండల యూత్ కాంగ్రెస్ బాధ్యతలు అప్పగించిన పార్టీ నాయకులకు కార్యకర్తలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ బలోపేతానికి పేదల కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ఇంటింటికి చేరవేసేందుకు తన వంతు కృషి చేస్తానని ఆయన పేర్కొన్నారు. మండలంలోని కాంగ్రెస్ కార్యకర్తలకు ఎలాంటి ఆపద వచ్చిన ఆదుకుంటామని భరోసా కల్పించారు. గ్రామ గ్రామాన యూత్ కాంగ్రెస్ పార్టీ కమిటీలు వేసి రానున్న స్థానిక సంస్థల ఎన్నికల వరకు పార్టీ బలోపేతం చేసి గెలుపే లక్ష్యంగా ముందుకు సాగుతామని ఆయన పేర్కొన్నారు.
