ప్రాంతీయం

రఘునాథ్ జన్మదినం సందర్భంగా మేఘా రక్తదాన కార్యక్రమం – బిజెపి

48 Views

మంచిర్యాల జిల్లా.

నేడు బీజేపీ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లి జన్మదినం సందర్భంగా బీజేపీ మంచిర్యాల పట్టణ శ్రేణులు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వారి సహకారంతో మంచిర్యాల పట్టణంలోని FCA ఫంక్షన్ హాల్ లో మెగా రక్త శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రక్త దాన శిబిరంలో బీజేపీ కార్యకర్తలు మరియు అభిమానులు రక్త దానం చేయడం. అనంతరం కార్యకర్తల నడుమ రఘునాథ్ కేక్ కట్ చేయడం జరిగింది. జిల్లా నుండి భారీగా బీజేపీ శ్రేణులు మరియు అభిమానులు వచ్చి రఘునాథ్ కు శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.

ఈ సందర్భంగా రఘునాథ్ మాట్లాడుతూ తనకు శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికి పేరు పేరునా ధన్యవాదాలు తెలిపారు. అత్యవసర సమయంలో రక్తం అవసరం ఉన్నవారికి సహాయం చేయాలనే ఉద్దేశంతో బీజేపీ కార్యకర్తలు ఈరోజు బీజేపీ శ్రేణులు ఈ రక్త దానం శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది అని తెలిపారు. బీజేపీ పార్టీ సేవా కార్యక్రమాలు చేయడంలో ముందుటారని ఎప్పడు ఎవరికి ఏ అవసరం ఉన్నా తమ వంతు సహాయ సహకారాలు అందిస్తూ సేవ కార్యక్రమాలు కొనసాగిస్తామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో వంగపల్లి వెంకటేశ్వర రావు, రజనీష్ జైన్, పెద్దపల్లి పురుషోత్తం, ముఖేష్ గౌడ్, ఎనగందుల కృష్ణ మూర్తి, బింగి ప్రవీణ్, సత్రం రమేష్, గడ్డం స్వామి రెడ్డి, మాదవరపు వెంకట రమణ రావు, హరి గోపాల్ మరియు తదితరులు పాల్గొన్నారు.

Oplus_131072
Oplus_131072
జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్