సేవా రత్న అవార్డు అందుకున్న మ్యాకల కనకయ్య..
*సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం పాముల పర్తి గ్రామ మాజీ సర్పంచ్ బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మ్యాకల కనకయ్య ముదిరాజ్ మంగళ వారం హైదరాబాద్ లో సావిత్రి బాయి పూలే జయంతి సందర్భంగా మహాజన సాహిత్య అకాడమీ ఆధ్వర్యంలో సేవా రత్న అవార్డు అందజేసి ఘన సన్మానం చేశారు. మర్కుక్ మండలంలో నిరుపేదలకు అండగా ఉంటూ నిరుపేద మహిళల పెళ్లికి పుస్తే మట్టెలు అందజేస్తూ,ఎవరికి ఆపద వచ్చినా నేను ఉన్న అంటు సహాయం అందజేస్తూ కరోనా సమయంలో విశేష సేవలు చేసిన సేవలను గుర్తించి సేవా రత్న అవార్డును శాసన మండలి సభ్యులు గోరేటి వెంకన్న ,ప్రముఖ కవి సతీష్ చందర్,తెలంగాణ సాహిత్య అకాడమీ చెర్మన్ జూలూరి గౌరీ శంకర్, ప్రొఫెసర్ నూరేపల్లి సుజాత చేతుల మీద అందజేయడం జరిగింది అని నిర్వాహకులు తెలిపారు. సేవా రత్న అవార్డు అందుకున్న కనకయ్య ముదిరాజ్ కు పలువురు అభినందనలు తెలిపారు*