ఎంపిపిఎస్ర్, పాములపర్తి,హెచ్ డబ్ల్యు, విద్యానగర్ కాలనీ పాఠశాలను పర్యవేక్షించిన సిద్దిపేట( డీఈవో )
సిద్దిపేట జిల్లా డిసెంబర్ 9
సిద్దిపేట జిల్లా మార్కుక్ మండలం పాములపర్తి విద్యానగర్ కాలనీ ( ఎంపీపీ ఎస్. హెచ్ డబ్ల్యు )పాఠశాలను సిద్దిపేట( డి ఈ ఓ) మార్కుక్ మండల్ ( ఎంఈఓ ) పర్యవేక్షణకు వచ్చారు. ఉపాధ్యాయుల చేత అంగన్వాడి కేంద్రంలో విద్యార్థులకు కొనసాగుతున్న విద్య బోధనను పరిశీలించారు. శిథిలావస్థలో ఉన్న ( ఎంపీపీ ఎస్. హెచ్. డబ్ల్యు ) పాఠశాల భవనాన్ని పరిశీలించారు. అదే విదంగా గ్రామస్థులు కొండనోళ్ళ నరేష్, వివో సభ్యులు మునిగడప భాగ్యమ్మ, గ్రామస్తుల తరుపున పిల్లలకు ఇబ్బంది తొలగించేల రెండు గదుల నూతన భవనాన్ని వీలైనంత త్వరగా మంజూరు చేయాలని కోరారు. ఇప్పటికే గ్రామస్తులం అందరం కలిసి నూతన పాఠశాల భవనం కోసం దరఖాస్తు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. ఇందుకు( డీఈవో) సానుకూలంగా స్పందించి మంజూరు చేయిస్తామన్నారు.
