ప్రాంతీయం

ఆశా కార్యకర్తల రిజిస్టర్లను విడుదల చేసిన కలెక్టర్

107 Views

మంచిర్యాల జిల్లా.

ఆశా కార్యకర్తల రిజిస్ట్రేషన్ విడుదల చేసిన జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్.

జిల్లా కలెక్టర్  కార్యాలయంలో జిల్లా కలెక్టర్  ఆశాలు వారు చేస్తున్న ఆరోగ్య కార్యక్రమాల పైన అందిస్తున్న సేవలు  నమోదు చేసుకోవడానికి ఆశా కార్యకర్తల రిజిస్టర్ లను విడుదల చేయడం జరిగినది .

మంచిర్యాల జిల్లాలో 651 ఆశా కార్యకర్తలు పని చేయుచున్నారు. వీరికి 3515 ఆశా కార్యకర్తల రిజిస్టర్లను ఇవ్వడం జరుగుచున్నది, ఈ రిజిస్టర్లో 17 రకాల వైద్య సేవలు వాటి నమోదు గురించి వివరంగా ఇవ్వడం జరిగినది. ఆశా డైరీ గ్రామ ఆరోగ్య సమాచారం అర్హులైన దంపతులు గర్భవతులు బాలింతల నమోదు నవజాత శిశువులు పసిబిడ్డల సంరక్షణ శిశువులకు పిల్లలకు వ్యాధి నిరోధక టీకాలు పౌష్టికారలోపంతో బాధపడుతున్న పిల్లలకు వైద్య చికిత్సలు ఐరన్ మాత్రలు మరణముల రిజిస్టర్ అసంక్రమణ వ్యాధులు వాటి నమోదు మందులు తీసుకుంటున్నారో లేదో తెలుసుకోవడం నమోదు చేయడం, మలేరియా బోదకాలు డెంగ్యూజేరువాలా నమోదు క్షయ కుష్టు వ్యాధి పైన నమోదు అవగాహన కార్యక్రమాలు మొదలగు వాటిపైన ఈ బుక్కులో ఆశా కార్యకర్తలు నమోదు చేయించాలి అని జిల్లా కలెక్టర్ తెలియజేసినారు.

ఈ కార్యక్రమంలో డాక్టర్ హరీష్ రాజ్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి, డాక్టర్ కృపా బాయ్ ప్రోగ్రాం ఆఫీసర్, డాక్టర్ ఫయాజ్, డాక్టర్ అనిల్, బుక్క వెంకటేశ్వర్ జిల్లా మాస్ మీడియా అధికారి పాల్గొన్నారు. ఈ పుస్తకములను ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి ద్వారా ఆశలకు అందజేయాలని తెలియజేశారు.

Oplus_131072
Oplus_131072
జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్