గ్రామ పంచాయతీల పెండింగ్ బిల్లు చెల్లించకుండా సర్పంచులపై మరింత భారాన్ని మోపుతున్న రేవంత్ రెడ్డి
తెచ్చిన అప్పులు తలబారమై మాజీ సర్పంచులకు ఉరితాలుగా మారే ప్రమాదముంది
సీఎం రేవంత్ రెడ్డి పెండింగ్ బిల్లులను తక్షణమే విడుదల చేయాలి
బీఆర్ఎస్ యంఎల్ఏ లను అసెంబ్లీలోకి రాన్నివ్వకుండ అడ్డుకోవడం అప్రజాస్వామికం
కాముని శ్రీనివాస్ బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు,ములకల కనకరాజుసొ,సైటీ చేర్మెన్
సిద్దిపేట్ జిల్లా డిసెంబర్ 9
సిద్దిపేట జిల్లా చిన్న కొడురు మాజీ సర్పంచుల అక్రమ అరెస్టులను మరియు బీఆర్ఎస్ ఎంఎల్ఏ లను అసెంబ్లీలోకి రానివ్వకుండ అడ్డుకోవడం అప్రజాస్వామికమని కండిస్తున్నామని బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు కాముని శ్రీనివాస్, పిఏసిఏసి చేర్మెన్ ములకల కనకరాజు అన్నారు.ఈ సందర్బంగా సోమవారం నాడు మండల కేంద్రంలోని అంబేద్కర్ సర్కిల్ వద్ద బీఆర్ఎస్ శ్రేణులు నిరసన తెలిపారు నాయకులు మాట్లాడుతు దిన దినము నిర్బంధాలు పెరిగిపోతున్నాయి తప్పితే ప్రజా సమస్యలు పరిష్కరించడానికి రేవంత్ రెడ్డి ముగ్గు చూపడం లేదని వారు అన్నారు పల్లెలే పట్టుకొమ్మలుగా పల్లెలు బాగుంటే దేశం బాగుంటుందని సొంతగా డబ్బులు ఖర్చులు పెడుతూ పల్లెలను అభివృద్ధి చేస్తే ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన రేవంత్ రెడ్డి మాట ఉస్తు త్వరలోనే మాజీ సర్పంచ్ల పెండింగ్ బిల్లులను విడుదల చేస్తామని చెప్పి సంవత్సర కాలంగా జాప్యం చేస్తున్నాడని తద్వారా మాజీ సర్పంచుల అప్పులు మిత్తిలు కట్టలేక ఇబ్బందులు పడుతున్నారని గతంలో అయితే కొంతమంది సర్పంచులు ఆత్మహత్యలు చేసుకున్నారని ఇకముందు అలా జరగకుండా ఉండాలంటే పెండింగ్ బిల్లులను తక్షణమే రిలీజ్ చేసి ఆదుకోవాలని అదేవిధంగా నేడు అసెంబ్లీ సమావేశాలు ఉండగా ఆ సమావేశాలకు ప్రజల చేత ఎన్నుకోబడ్డ ఎమ్మెల్యేలను ముఖ్యంగా బిఆర్ఎస్ ఎమ్మెల్యేలను అసెంబ్లీ లోపలికి రాకుండా అడ్డుకొని గేట్లు పెట్టుకోవడం అప్రజా స్వామికమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నియంత పోకడ అని దుయ్యబట్టారు తెలంగాణ రైతుల చేత ప్రజల చేత రేవంత్ రెడ్డికి నిరసన వ్యక్తమౌతున్న రేవంత్ రెడ్డికి చీమకుట్టినట్టుగా కూడ లేదని వారు అన్నారు ఇకనైనా ప్రజాపాలన పైన దృష్టి పెడితే బాగుంటుందని లేకుంటే ప్రజా ఆగ్రహానికి గురికాక తప్పదని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో కాముని శ్రీనివాస్, ములకల కనకరాజు, జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్, కాముని ఉమేష్ చంద్ర, ఇట్టమేన శ్రీనివాస్, కొండం రవీందర్ రెడ్డి, పడిగె లింగం, మన్నే ఆనంద్, సుంచు రమేష్, కామ శ్రీనివాస్, సబ్బెన కనకయ్య తదితరులు పాల్గొన్నారు.
