ప్రాంతీయం

మంచిర్యాలలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ

45 Views

ప్రజా పాలన విజయోత్సవాల్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు.

సోనియా గాంధీ జన్మదినం సందర్భంగా కేక్ కట్ చేసి, జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించిన మంచిర్యాల జిల్లా  కాంగ్రెస్ పార్టీ శ్రేణులు.

కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో 3000 మందికి అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.

రాష్ట్రం ప్రభుత్వం ఈరోజు తెలంగాణ తల్లి విగ్రహా ప్రతిష్టాపన మహోత్సవం సందర్భంగా మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు మరియు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ ఆదేశాల మేరకు, మంచిర్యాల ఎమ్మెల్యే నివాసం నుండి బెల్లంపల్లి చౌరస్తా, రైల్వే స్టేషన్ రోడ్డు, మార్కెట్ రోడ్డు, ముకరం చౌరస్తా, ఓవర్ బ్రిడ్జ్ మీదిగా మంచిర్యాల ఐబీ చౌరస్తా వరకు పెద్ద ఎత్తున బైక్ ర్యాలీ నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ శ్రేణులు.

అనంతరం దశాబ్దాల ప్రత్యేక రాష్ట్ర కలను సాకారం చేసిన తెలంగాణ తల్లి సోనియా గాంధీ జన్మదిన సందర్భంగా ఘనంగా వేడుకలు నిర్వహించి కేక్ కట్ చేసి, అన్నదాన కార్యక్రమం చేసిన మంచిర్యాల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు, మహిళా నాయకురాలు, యువజన కాంగ్రెస్ నాయకులు, NSUI నాయకులు, కార్యకర్తలు, అభిమానులు.

Oplus_131072
Oplus_131072
జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్