దౌల్తాబాద్: మండలంలోని నిరుపేద కుటుంబాలను ఆదుకోవడమే లక్ష్యమని బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు రణం శ్రీనివాస్ గౌడ్ అన్నారు. మండల పరిధిలోని లింగాయపల్లి తండాలో ఇటీవల విఠల్ పూరిగుడిసె ప్రమాదవశాత్తు దగ్ధం ఆయన విషయం తెలిసిందే. మంగళవారం కుటుంబాన్ని పరామర్శించి తన కూతుర్లు శీనిత్య, శ్రీనిధి పుట్టినరోజు సందర్భంగా కుటుంబానికి దుప్పట్లు, వంట సామాగ్రి అందజేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ దేవి యాదగిరి, గ్రామస్తులు బాలు, మంజ, పుల్యా, బిఖ్యా, దుర్గేష్, శ్రీకాంత్, ప్రకాష్, రాజు, రమేష్, దూపియా తదితరులు పాల్గొన్నారు…
