ప్రాంతీయం

తెలంగాణ తల్లి రూపురేఖలు మార్చడాన్ని ఖండిస్తున్నాం

47 Views

తెలంగాణ తల్లిని… కాంగ్రెస్ తల్లిగా మార్చేశారు

తెలంగాణ తల్లి రూపురేఖలు మార్చడాన్ని ఖండిస్తున్నాం

మార్కెట్ మాజీ వైస్ చైర్మన్ ఉపేందర్ రెడ్డి

డిబేట్ జిల్లా డిసెంబర్ 9

జగదేవపూర్ : తెలంగాణ ఉద్యమ తల్లిని కాంగ్రెస్ తల్లిగా రూపురేఖని మార్చి యావత్ తెలంగాణ ప్రజల్ని ఏమార్చి తెలంగాణ ప్రస్తుతానికి తూట్లు పొడుస్తున్న ఈ దుష్ట కాంగ్రెస్ అని గజ్వేల్ మాజీ మార్కెట్ వైస్ చైర్మన్ ఉపేందర్ రెడ్డి విమర్శించారు. సోమవారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరులతో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి దుర్మార్గ ఆరాచక పాలన సాగుతుందని మండిపడ్డారు, ఈరోజు బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ర్యాలిగా అసెంబ్లీకి వెళ్తున్న వారిని అడ్డుకోవడం సిగ్గు చేటు అని ఆగ్రహం వ్యక్తం చేశారు, ప్రజలు ప్రతిపక్షాల గొంతు నొక్కిఎందుకు సీఎం రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నారని దుయ్యబట్టారు, కేసీఆర్ పై కుట్రతోనే తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చారని ఆరోపించారు, ఆమె విగ్రహాన్ని మార్చాలని ఎవరైనా ఉద్యమాలు చేశార అని ప్రశ్నించారు. ఒక తెలంగాణ ఉద్యమ తల్లిని నేడు కాంగ్రెస్ తల్లిగా మార్చారు అని మండిపడ్డారు. కోట్లాదిమంది తెలంగాణ బిడ్డల్లో స్ఫూర్తి నింపింది తెలంగాణ తల్లి ఆ తల్లి రూపురేఖల్ని మార్చడానికి తీవ్రంగా ఖండిస్తున్నామని పేర్కొన్నారు, బతుకమ్మతో పువ్వులను పూజించే సంస్కృతి తెలంగాణలో తప్ప ప్రపంచంలో మరిక్కడ లేదు అని తెలంగాణ తల్లి నుంచి బతుకమ్మను దూరం చేయడం దృష్టకరమని అన్నారు. ఉద్యమకారులపై తుపాకి ఎక్కుపెట్టిన పార్టీకి తెలంగాణ తల్లికి నిహళ్లులు అర్పించే.హక్కు లేదని ఒకవేళ ఆ పని చేయాలనుకుంటే గన్ పార్క్ వద్ద సీఎం రేవంత్ రెడ్డి ముక్కు నేలకు రాయాలని చెప్పారు.

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

రాచర్ల గొల్లపల్లి లో సర్పంచ్ గా గెలిచేది ఎవరు...?
ములుగు విజయ్ కుమార్ తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్