ప్రాంతీయం

ప్రజా పాలన వారోత్సవాల్లో పాల్గొన్న వివేక్ వెంకటస్వామి

90 Views

మంచిర్యాల జిల్లా

చెన్నూరు మున్సిపల్ ఆఫీసులో ప్రజా పాలన వారోత్సవాల్లో పాల్గొన్న చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి,వివిధ శాఖల అధికారులు.

వివేక్  కామెంట్స్.

గత ప్రభుత్వం మూడు లక్షల కోట్ల అప్పు ఉంది చెప్పింది..కానీ వాస్తవంగా 7 లక్షల కోట్లకు పైగా అప్పుచేసి ఖజానా మొత్తం ఖాళీ చేసింది.గత బిఆర్ఎస్ సర్కార్ ఇచ్చిన హామీలను నెరవేర్చలేదు.

సీఎం రేవంత్ రెడ్డి ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు కట్టుబడి ఉన్నాడు.ఆరు గ్యారెంటీల్లో ఐదు గ్యారంటీలను పక్కాగా అమలు చేశాం.ఉచిత బస్సు సౌకర్యానికి నెలకు 300 కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీకి డబ్బులు చెల్లిస్తుంది.4000 కోట్ల రూపాయలను మహిళల ఉచిత బస్సు ప్రయాణం కోసం ఆర్టీసీ ఖాతాలో డబ్బు జమ చేసింది.

రెండు లక్షలకు పైగా ఉన్న రైతులకు రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీది.గత ప్రభుత్వంలో ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపించే వారు,కానీ కాంగ్రెస్ ప్రభుత్వంలో అక్రమ అరెస్టులు ఉండవు.కాంగ్రెస్ పాలనలో ప్రజలకు స్వేచ్ఛ ఉంది. అభివృద్ధి కోసం ప్రశ్నించాలి.చెన్నూరు టౌన్ లో 10 కోట్ల తో అభివృద్ధి పనులను చేపడుతున్నాం.

No Slide Found In Slider.

Poll not found