ప్రాంతీయం

నియామక ఉత్తర్వులు అందుకున్న విజయ్

32 Views

మండల పరిధిలోని ముబారాస్ పూర్ గ్రామానికి చెందిన నీరుడి విజయ్ ఇటీవల తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన గ్రూప్ 4 నోటిఫికేషన్ లో ఉద్యోగం సాధించాడు. కాగా మంగళవారం తెలంగాణ ప్రజా పాలన విజయోత్సవాలలో భాగంగా పెద్దపల్లి జిల్లా కేంద్రంలో నిర్వహించిన యువ సంకల్ప సభలో నియామక ఉత్తర్వులు అందుకున్నాడు. కాగా ఈ కార్యక్రమంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ నోటిఫికేషన్ లో ఎంపికైన ఎనిమిది వేలకు పైగా అభ్యర్థులకు నియామక ఉత్తర్వులు అందజేశారు. విజయ్ గజ్వేల్ ప్రభుత్వ బాలికల డిగ్రీ కళాశాల (ఎడ్యుకేషన్ హబ్) లో పోస్టింగ్ పొందినట్లు ఒక ప్రకటనలో తెలిపాడు. కాగా మారుమూల ప్రాంతానికి చెందినప్పటికీ అటు పేదరికం ఇబ్బంది పెట్టిన తట్టుకొని నిలబడి ఉద్యోగం సాధించిన విజయ్ ను మాజీ సర్పంచ్ లు దార సత్యనారాయణ, యాదగిరి, మాజీ ఎంపీటీసీ తిరుపతి, మాజీ ఉప సర్పంచ్ స్వామి, గ్రామస్తులు తదితరులు అభినందనలు తెలిపారు.

Oplus_131072
Oplus_131072
Manne Ganesh Dubbaka