రాయపోల్: మహిళ అదృశ్యమై మృతి చెందిన సంఘటన రాయపోల్ మండల పరిధిలోని సయ్యద్ నగర్ గ్రామంలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం సయ్యద్ నగర్ కు చెందిన పటాన్ మదీనా(35) రామరం గ్రామంలోని రాందాస్ చెరువులో పడి మహిళా మృతి చెందినట్లు తెలిపారు. వీరి వృత్తి రాళ్లు కొట్టుకుంటూ జీవనం కొనసాగించేవారు. రోజు లాగానే శుక్రవారం కుటుంబ సభ్యులం అందరం రాత్రి నిద్రపోయామని తెల్లవారుజామున లేచి చూసేసరికి పటాన్ మదీనా కనిపించకపోవడంతో బంధువుల వద్ద మరియు చుట్టుపక్కల ఎక్కడ వెతికిన కనిపించలేదు ఇట్టి విషయంపై మృతురాలి అన్న మహమ్మద్ హుస్సేన్ శనివారం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా పోలీసులు మిస్సింగ్ కేస్ కింద నమోదు చేశామన్నారు. సోమవారం రాందాస్ చెరువులో శివమై తేలిన శవాన్ని పటాన్ మదిన గా గుర్తించి పోస్టుమార్టం నిమిత్తం గజ్వేల్ ప్రభుత్వ ఆసుపత్రిలిసినట్లు ఎస్ఐ మహబూబ్ తెలిపారు.
