ప్రపంచ నేలలో దినోత్సవం సందర్భంగా వ్యవసాయశాఖ, వ్యవసాయ పరిశోధన స్థానం, ఏరువాక కేంద్రం, తోర్నాల వారి అద్వర్యంలో గురువారం రాయపోల్, మంతూర్, వడ్డేపల్లి, అరేపల్లి రైతువేదికలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం గురించి ప్రధాన శాస్త్రవేత్త హెడ్ డా. ఎస్.శ్రీదేవి “ప్రపంచ నేలల దినోత్సవం, 2024 (డిసెంబర్, 5) యొక్క ముఖ్య ఉద్యేశం “నేలల కోసం సంరక్షణ, కొలత, మానిటర్” గురించి వివరించి ఆరోగ్యకరమైన నేలల సంరక్షణకు చేపట్టవలసిన యాజమాన్య పద్ధతులు, సేంద్రియ ఎరువులు, జీవన ఎరువులు, పచ్చిరొట్ట ఎరువులు, పంట మార్పిడి, చౌడును తగ్గించే మార్గాలు, యాసంగి సాగుకు అనువైన ఆరుతడి పంటల గురించి అవగాహన కల్పించారు. రైతులు పత్తి కట్టెను, వరి మోళ్లను పంట పొలంలో కాల్చివేయడం వలన గాలి కాలుష్యంతో పాటు మొక్కలోని పోషకాలు కోల్పోతాయని తెలిపి, యంత్రం ద్వారా ముక్కలుగా చేయడం వలన మొక్కలోని పోషకాలు నేలలో చేరడం వలన ఎరువుల మోతాదు తగ్గించవచ్చని వివరించడం జరిగింది. డా. శ్రీ జయ శాస్త్రవేత్త (మృత్తికా శాస్త్ర విభాగం) మాట్లాడుతూ మట్టి నమూనా పద్దతి, నేల ఆరోగ్యం యొక్క ప్రాముఖ్యత గురించి తెలియజేసారు. తర్వాత ఏడిఏ బాబు నాయక్ మాట్లాడుతూ జిల్లా రైతులు అందరు మట్టి పరీక్షను తప్పకుండ చేపించుకోవాలని, ఆయిల్ ఫామ్ ను వేసుకోవాలని తెలపడం జరిగింది. ఈ కార్యక్రమంలో వ్యవసాయ పరిశోధన స్థానం, ఏరువాక కేంద్రం, తోర్నాల శాస్త్రవేత్తలు డా.సిహెచ్. పల్లవి (మొక్కజొన్న యాజమాన్య పద్దతులపై), డా. ఈ.ఉమారాణి (పొద్దుతిరుగుడు మేలైన రకాలు), డా.డి.శ్వేత (పోద్దుతిరుగుడులో కలుపు, ఎరువుల యాజమాన్యం), సిద్దిపేట భూసార పరీక్షా కేంద్రం వ్యవసాయ అధికారి శ్రీనివాస్ వడ్డేపల్లి రైతు వేదికలో ప్రపంచ నేలల దినోత్సవం గురించి వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి నరేష్, వ్యవసాయ విస్తరణ అధికారి కవిత, స్వర్ణలత , రజిత, ప్రవీణ్, ఆయా గ్రామల రైతులు తదితరులు పాల్గొన్నారు.




