నిర్మల్ జిల్లా.
ఆశా వర్కర్లకు పిక్స్డ్ వేతనం 18 వేల రూపాయలు ఇవ్వాలి. కార్మిక లేబర్ కోడ్ చట్టాలను రద్దు చేయాలి -సీ ఐ టీ యూ
శుక్రవారం రోజు అంబేద్కర్ విగ్రహం నుంచి మహా ప్రదర్శన ర్యాలీ నిర్వహించి అనంతరం టీఎన్ జిఓ భవనంలో ఆశా వర్కర్ యూనియన్ జిల్లా 3వ మహాసభలు ప్రారంభించడం జెండా ఆవిష్కరణ సీనియర్ నాయకులు శశికళ ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా ఆశ వర్కర్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు జయలక్ష్మి మాట్లాడుతూ ఆశా కార్యకర్తలు అనేక పని ఒత్తిడి తట్టుకొని నిత్యం సేవలు అందిచటం వల్ల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి అవార్డ్స్, రివార్డ్ పొందారు. కనీస వేతనం నిర్ణయం చేయాలని ఆందోళన చేస్తుంటే నిర్లక్ష్యం వహిస్తూ అందరిని రోడ్ మీద పడి వేశారు. కనీస వేతనం రూ.18000 వచ్చేవరకు పోరాటం ఆపేది లేదని తెలియచేశారు.
ఆంధ్రప్రదేశ్ లో ఫిక్స్డ్ వేతనం రూ.10000 అమలు చేస్తున్నారు.కేరళ రాష్ట్రలో 18000/- ఇస్తున్నారు. ధనిక రాష్ట్రం బంగారు తెలంగాణలో కనీసం ప్రమాద భీమా సౌకర్యం పొందలేని దౌర్భాగ్య పరిస్థితి నెలకొన్నది. దేశంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం కార్మిక లేబర్ కోడ్ చట్టాలు రద్దు చేసి నాలుగు కోట్లుగా తీసుకురావడం జరుగుతుంది కార్మికుల నష్టం చేసే విధంగా ఉంది కాబట్టి కార్మిక లేబర్ కూడా చట్టాలను వెంటనే రద్దు చేయాలని సిఐటియు డిమాండ్, తెలంగాణ రాష్ట్రానికి కాంగ్రెస్ ప్రభుత్వము ఆశా వర్కర్ల పిక్షుడు వేతనం 18 వేల రూపాయలు ఇచ్చే విధంగా ఈ అసెంబ్లీ సమావేశాల్లో నిర్ణయం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ఆశ వర్కర్లకు జాబ్ షాట్ కు సంబంధించిన పనులే చెప్పాలి, గుర్తింపు కార్డులు ఇవ్వాలి యూనిఫార్మ్స్ కాటన్స్ ఇవ్వాలి,ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలి, ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి,
బొమ్మెన.సురేష్ సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ ఆశా వర్కర్లకు రాష్ట్రంలో 18 వేల రూపాయలు ఇవ్వాలని. రంగంలో సెకండ్యంగా చేసిన వారికి ప్రమోషన్స్ ఇవ్వాలి, తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ సమావేశ సందర్భంగా, ఆశ వర్కర్లకు కనీ ఫిక్స్డ్ వేతనం 18 వేల రూపాయలు ఇచ్చే విధంగా నిర్ణయం చేయాలని సిఐటియు నిర్మల్ జిల్లా కమిటీ డిమాండ్ చేస్తుంది, డిసెంబరు 15వ తారీకు నుంచి ఆశ వర్కర్ రాష్ట్ర బస్సు యాత్ర నిర్మల్ నుంచే ప్రారంభమవుతుంది దీనికి ముఖ్యఅతిథిగా పాలడుగు భాస్కర్ సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి,ఆశ వర్కర్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు జయలక్ష్మి అదేవిధంగా ఆల్ ఇండియా నాయకులు ఈ బస్సు యాత్రలో పాల్గొంటారు,ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లాఉపాధ్యక్షులు జి కిషన్ కుమార్,జిల్లా కమిటీ సభ్యులు డి .పోశెట్టి ఆశ వర్కర్ యూనియన్ జిల్లా కమిటీ 41 ఎన్నిక
నూతన అధ్యక్షురాలుగా కామ్రేడ్ బి సుజాత, ఉపాధ్యక్షులుగా చంద్రకళ విజయ, సరిత, ఇంద్రమాల సరిత, అనసూర్య, సుగుణ,
జిల్లా ప్రధాన కార్యదర్శి పి .గంగమణి జిల్లా సహాయ కార్యదర్శిగా శ్యామల,సులోచన, విజయ,జ్యోతి పద్మ,విజయ జిల్లా కోశాధికారిగా రామలక్ష్మి తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్ సీఐటీయూ పి గంగామణి జిల్లా ప్రధాన కార్యదర్శి తదితరులు పాల్గొన్నారు.
