తెలుగు 24/7న్యూస్ (తొర్రూరు ప్రతినిధి) మార్చి 31
టికెట్ వస్తుందంటే
నాకే టికెట్ వస్తుందంటూ
నాకే టికెట్ ఇస్తుందంటూ
ఆశావాహుల ఆడంబరాలు
బి ఆర్ఎస్ పార్టీ నాయకత్వం
అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపాలు కావడంతో మళ్లీ గత వైభవాన్ని
సంపాదించాలంటే ఎలా అనే ఆలోచనలో తల మునకలై ఉంటే
పార్టీని వీడుతున్న నేతల సమస్య
మరో వైపు మద్యం కేసులు చుట్టు ముట్టి ఊపిరాడకుండా చేస్తున్న సమస్యలతో పార్టీ మనుగడ ప్రశ్నార్ధకంగా మారింది. కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఆరు గ్యారెంటీల పథకాలలో కొన్ని పథకాలను అమలుచేసి మిగిలిన పథకాలను అమలు చేయకుండా రేపు మాపు అంటూ దాటవేస్తూ ఎంపీ ఎలక్షన్లలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించినప్పుడే అమలు చేస్తామనే ఆలోచనను ప్రజలెవరు నమ్మే పరిస్థితిలో లేరనే మాటలు అక్కడక్కడ ప్రజల్లో వినిపిస్తున్న చర్చలు.
అంతేకాకుండా ఎల్లారెస్ అంశాన్ని తెరమీదకి తెచ్చి కష్టపడి సాధించుకున్న అధికారాన్ని సంపాదించుకున్న మంచి పేరును అప్రతిష్ట పాలు చేసుకునే దిశగా అడుగులు వేస్తుందని తన వేలుతోనే తన కంట్లో పొడుచుకునే చందంగా కాంగ్రెస్ పార్టీ విధానాల వింత చోద్యం చేసుకుందని అక్కడక్కడ వినిపిస్తున్న సంకేతాలు. గతంలో బి ఆర్ఎస్ పార్టీ ఎల్లారేస్ విధానాన్ని ప్రవేశపెడితే అప్పుడు ప్రత్యక్షంలో ఉన్న కాంగ్రెస్ ససేమిరా వద్దంటూ ప్రజల పక్షాన పోరాడి అధికారంలోకి రాగానే మళ్లీ ఎల్లారీస్ విధానాన్ని తెరమీదకి తేవడం నమ్మి ఓట్లేసిన ప్రజలపై బారాన్ని మోపడం ఏమిటీ అని మేధావులు విద్యావంతుల మదిలో నానుతున్న చర్చనియాంశం , అంతేకాకుండా బి ఆర్ఎస్ పార్టీని భూస్థాపితం చేయాలనే ఆలోచనతో ఆ పార్టీ నాయకులను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవడం మంది ఎక్కువైతే మజ్జిగ పల్చనా అనే చందంగా పునాదులు వేసుకున్న పటుత్వాన్ని పేకమెడల్లా కూల్చుకునే పరిస్థితి తనే చేతులారా తయారు
చేసుకుంటుందని మేధావుల మదిని తొలుస్తున్న ప్రశ్నగా మారింది. దీంతో బి ఆర్ఎస్ పార్టీలో నమ్మినవారెవరు, నమ్మకద్రోహం చేసేవారు అనే కొత్త కోణాలు వెలుపడ్డాయి. దీంతో మళ్లీ భవిష్యత్తులో పార్టీలో చేరాలని వచ్చేవారు ప్రాధేయ పడ్డ చేర్చుకోమననే అంశాన్ని ఖరాఖండిగా బి ఆర్ఎస్ పార్టీ అధిష్టానం నేతలు చెప్పకనే చెబుతున్నారు. ఏది ఏమైనా బిఆర్ఎస్ పార్టీలో కొత్త ఆశలు చిగురించాయని చెప్పవచ్చు. దీన్ని సాకుగా చేసుకొని బి ఆర్ఎస్ పార్టీ అధిష్టానం అచి తూచి ముందుకు అడుగులు వేస్తూ ఎలాగైనా పూర్వ వైభవాన్ని సాధించాలనే తపనతో వరంగల్ ఎంపీ టికెట్ ఎస్సీకి రిజర్వు కావడంతో డాక్టర్ గా స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు చేస్తున్న కడియం కావ్యకు జిల్లాలో మంచి పేరు వినిపిస్తుండడంతో బి ఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా ఆమె ను డిక్లేర్ చేశారు. దీంతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని బరిలో దింపుతే కడియం కావ్య ముందు ఓటమి పాలు కావడం తద్యమనే ఆలోచనలో భాగమే ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, కూతురు కడియం ట్రస్ట్ ఫౌండర్, డాక్టర్ కడియం కావ్య లను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవడానికి కాంగ్రెస్ పార్టీ తరఫున ఎంపీగా నిలబడేందుకు వారిచ్చిన భరోసానే బి ఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి మాజీ సియం కెసిఆర్ కు రాజీనామా లేఖను పంపించారనే అంశాన్ని మేధావులు, విజ్ఞానవంతులు అక్కడక్కడ చర్చించుకుంటూనే ఉన్నారు. ఓవైపు బి ఆర్ఎస్ పార్టీ అధిష్టానం నాకే ఎంపీ టికెట్ ఇస్తుందంటే నాకే ఇస్తుందంటూ అంటూ నాకే వస్తుందంటూ ఆశావాహులు మల్ల గుల్లాలు పడుతున్నారు. అందులో భాగంగానే పెద్ది స్వప్న, బోడ డిన్నా, జోరిక రమేష్, మళ్లీ గులాబీ గూటికి చేరబోతున్న తాటికొండ రాజయ్య, సినీ నటుడు బాబూమోహన్, మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణానికి చెందిన పంజా కల్పన, మంగళంపల్లి శ్రీనివాస్ పేర్లు తెర మీదకి వచ్చాయి. బి ఆర్ఎస్ పార్టీ అధిష్టానం మదిలో మెదిలెందుకు పత్రికలు వేదికలయ్యాయి. ఏది ఏమైనా వరంగల్ ఎంపీ టికెట్ ఎవరిని వరిస్తుందో అనే ఉత్కంఠకు వరంగల్ జిల్లా చింతగట్టు కేఎల్ఎన్ ఫంక్షన్ హాల్ చింతగట్టు నందు సోమవారం జరిగే సమావేశంలో మాజీమంత్రి హరీష్ రావు సారథ్యంలో ఎంపీ అభ్యర్థిని నియమించి ప్రజల్లో ఆశావాహుల్లో ఉన్న ఉత్కంఠ ను తొలగించనున్నారు. కాగా వంజా కల్పన గత మూడు నెలల నుండి
వరంగల్ పార్లమెంట్ అభ్యర్థిగా ప్రచారంలో దూసుకెళ్తున్నారు. వృత్తిరీత్యా ఉపాధ్యాయురాలు కావడంతో సామాజిక అంశాలపై సందర్భోచిత వాఖ్యానాలపై మంచి పట్టు ఉన్న మహిళ కావడంతో మాజీమంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆమె ప్రతిభ పాటవాలను మెచ్చి ఎర్రబెల్లి చారిటబుల్ ట్రస్ట్ కోఆర్డినేటర్ గా నియమించారు. ఎర్రబెల్లి చారిటబుల్ ట్రస్ట్ కు ఉన్న పేరును మరింత ఇనుమడింప జేసేలా తన మేధో సామర్థ్యంతో ఒప్పజెప్పిన బాధ్యతలకు పూర్తి న్యాయం చేయగలిగారు. ట్రస్టు ద్వారా నిర్వహించిన నిరుద్యోగ యువతకు శిక్షణతో పాటు మహిళలకు కుట్టు మిషన్ శిక్షణ నిచ్చి, ఉపాధి అవకాశాలను కల్పించి అందరినీ సమన్వయం చేసుకొని నియోజకవర్గమే కాకుండా జిల్లా స్థాయిలో కూడా ఎక్కడ చూసినా ఎక్కడ విన్నా వరంగల్ ఎంపీ టికెట్ పంజా కల్పనకు ఇస్తే
గెలిపిస్తామనే ఆదరణ మూడు నెలల నుండి ఏడు నియోజకవర్గాల ప్రజలలో కనిపిస్తున్న వినిపిస్తున్న ప్రచార సారాంశం చెప్పకనే చెబుతుంది. దీంతో పంజా కల్పనకు ప్రజల్లో నుండి వస్తున్న ఆదరాభిమానాలు, ఎర్రబెల్లి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా నిరుద్యోగ యువతకు శిక్షణను ఇచ్చిన వారి మేధో శక్తి, ఎంతో భవిష్యత్తు ఉన్న 17 సంవత్సరాల ఉపాధ్యాయ వృత్తిని త్యాగం చేసిన వారి త్యాగనిరతి, సేవా తత్పరత సెగలు టిఆర్ఎస్ పార్టీ అధిష్టానానికి తగిలాయి దీంతో వరంగల్ జిల్లా KLN ఫంక్షన్ హాల్ చింతగట్టు నందు సోమవారం జరిగే సమావేశంలో మాజీ మంత్రి హరీష్ రావు, తీసుకోబోవు నిర్ణయం పంజా కల్పనకు అనుకూలమైన నిర్ణయంగా బలం చేకూర్చుతుందనే అంశం ఆదరిస్తున్న ప్రజల్లో, ఆశీర్వదిస్తున్న అభిమాన దనుల్లో నిరుద్యోగ యువతలో బలంగా నెలకొంది.. ఏది ఎమైనా 17 ఏళ్ళ ఉపాధ్యాయ వృత్తినే త్యాగం చేసిన వారి త్యాగనిరతికి పట్టని కట్టాలని ఆశీద్దాం..!
నాల్లం శ్రీనివాస్ (కవి )✍️




