ముస్తాబాద్, ప్రతినిధి వెంకటరెడ్డి మే29, విలేఖర సమావేశంలో బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర కోఆర్డినేటర్ కంచర రవి గౌడ్ మాట్లాడుతూ బీసీలు అంటే బిచ్చగాళ్లు కాదని కులాలవారీగా కులవృత్తులు చేసుకునే వారికి లక్ష రూపాయలు ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వం అన్నదని పేర్కొన్నారు. ప్రకటించిన రాష్ట్ర ఎన్నికల సమయంలో మాత్రమే ప్రధాన పార్టీలకు రాష్ట్ర ప్రభుత్వానికి బీసీలు గుర్తుకొస్తున్నారని అన్నారు. బీసీల అందరికీ కూడా బీసీ బందును పది లక్షల వెంటనే ప్రకటించాలని రాష్ట్ర ప్రభుత్వం తొమ్మిది సంవత్సారాలుగా కేవలం ఒక్కసారి మాత్రమే బిసి కార్పొరషన్ లోన్ లను వేసింది కానీ అందులో కూడా అర్హత కలిగిన వారికి కూడా అందరకీ ఇయ్యకుండ కేవలం 50,000/- రూపాయలు ఇచ్చి సర్ధిపెట్టుకుంది అని మళ్ళీ రెండో విడత పంపిణీ జరగలేదని ఆవేదన వ్యక్తంచేశారు, ప్రతి సంవత్సరం బిసిలకు కేటాయించడం తక్కువే అందులో కూడా మొత్తం ఖర్చు చెయ్యకుండా ఇప్పుడు బిసిలు జపం చేస్తున్నాయని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం బిసి బందు పది లక్షల రూపాయలు వెంటనే ప్రకటించి అమలు చెయ్యాలని మా డిమాండ్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈకార్యక్రమంలో బీసీ విద్యార్థి సంఘం సిరిసిల్ల డివిజన్ ఇంచార్జీ ఇల్లందుల ప్రకాష్, మండల అధ్యక్షులు మట్టే నరేష్, నాయకులు, అనిల్, అల్లే నీరజ్ లు పాల్గొన్నారు
