చేగుంట మండలం పోతాస్పల్లి గ్రామానికి చెందిన బాల సాయి జయ హరిప్రసాద్ దంపతులకు ఒకే కాన్పులో సిద్దిపేట జిల్లా, గజ్వేల్ ప్రభుత్వ దవాఖానలో ముగ్గురు ఆడ పిల్లలకు జన్మించారు. చేగుంట మండలం పోతాన్పల్లి గ్రామానికి చెందిన బాల సాయి జయ విద్యా వాలంటలీర్లు సంఘం రాష్ట్ర కార్యదర్శిగా పనిచేస్తున్నారు. భర్త బాలసాయి హరిప్రసాద్ విద్యావాలంటీర్ల సంఘం మెదక్ జిల్లా అధ్యక్షులుగా, పోతాన్పల్లి టీఆర్ఎస్ గ్రామ కమిటీ అధ్యక్షులుగా పనిచేస్తున్నారు. వీరికి పెండ్లియై 13 సంవత్సరాలు కాగా కొంత కాలం నుంచి పిల్లలు లేరని చింత ఉండేంది. తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ వైద్యానికి పెద్ద పీట వేయడంతో. గజ్వేల్ ప్రభుత్వ దవాఖానలో వైద్యపరీక్షలు చేసుకున్నారు. గజ్వేల్ ప్రభుత్వ వైద్యులు డాక్టర్ త్రివేణి, డాక్టర్ అన్నపూర్ణ, డాక్టర్ మంజుల, డాక్టర్ రాము, డాక్టర్ మహిపాల్, డాక్టర్ శంత న్రెడ్డి, వైద్య సిబ్బంది సూచనల మేరకు ప్రతి నెల వైద్యుల సూచనలతో బాల సాయి జయ వైద్య పరీక్షలు చేసుకున్నారు. 9నెలలు నిండడంతో జయకు కాన్పు నొప్పులు రావడంతో గజ్వేల్ ప్రభుత్వ దవాఖానకు తీసుకెళ్లాగా సోమవారం మధ్యాహ్నాం 12:30 నిముషాల సమయంలో వైద్యుల పర్యవేక్షణలో జయ ముగ్గురు ఆడ పిల్లలకు జన్మనిచ్చింది. పుట్టిన ముగ్గురు ఆడ పిల్లలు ఆరోగ్యంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. పేద వారికోసం ప్రభుత్వ దవాఖానలో రూపాయి ఖర్చు లేకుండ మంత్రి హరీశ్రావు, తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న కృషికి బాలసాయి జయ, హరిప్రసాద్ దంపతులు కృతజ్ఞతలు తెలిపారు.




