*బ్లాస్టింగ్ కార్మికులను బ్లాస్టింగ్ క్రూగా గుర్తించి సెమి స్కీల్డ్ వేతనం చెల్లించాలి.*
*సిఐటియు యూనియన్ లోకి చేరిన బ్లాస్టింగ్ కాంట్రాక్టు కార్మికులు*
*యూనియన్ లోకి సాదరంగా ఆహ్వానించిన ఎస్ సి కె ఎస్- సి ఐ టి యు రాష్ట్ర అధ్యక్షులు*
దూలం శ్రీనివాస్
సింగరేణి కాంట్రాక్టు కార్మిక సంఘం (సిఐటియు) రాష్ట్ర అధ్యక్షులు
మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ డివిజన్ పరిధిలోని ఎస్ఆర్పి ఓబి జి.వి.ఆర్ లో పనిచేస్తున్న బ్లాస్టింగ్ కాంటాక్ట్ కార్మికులు సింగరేణి కాంట్రాక్టు కార్మిక సంఘం సిఐటియు లోకి చేరడం జరిగింది. కార్మికులను యూనియన్ లోకి సాదరంగా ఆహ్వానించిన రాష్ట్ర అధ్యక్షులు దూలం శ్రీనివాస్. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… సింగరేణి వ్యాప్తంగా ఓబీలలో పనిచేస్తున్న బ్లాస్టింగ్ కాంటాక్ట్ కార్మికులను బ్లాస్టింగ్ క్రూ గా గుర్తించి సెమీ స్కీల్డ్ వేతనాలను అమలు చేయాలని డిమాండ్ చేశారు.
2021లో ఇందారం ఓబీ బ్లాస్టింగ్ కాంట్రాక్టు కార్మికులకు సెమిస్కీల్డ్ వర్కర్లుగా గుర్తించాలని అసిస్టెంట్ లేబర్ కమిషనర్ ఆధ్వర్యంలో జరిగిన చర్చల్లో, బ్లాస్టింగ్ కాంట్రాక్ట్ కార్మికులకు సెమిస్కీల్డ్ వేతనాలు చెల్లించాలని లేబర్ కమిషనర్ ఆధ్వర్యంలో అగ్రిమెంట్ జరిగింది. కానీ అధికారులు మాత్రం దానిని అమలు చేయించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. అధికారులు ఇప్పటికైనా స్పందించి బ్లాస్టింగ్ కాంట్రాక్టు కార్మికులకు సెమిస్కీల్డ్ వేతనాలు అమలయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని, లేని పక్షంలో ఆందోళన, పోరాటాలకు సైతం సిద్ధమైతామని ఈ సందర్భంగా తెలియజేశారు.
*బ్లాస్టింగ్ కార్మికుల నూతన ఫిట్ కమిటీ ఎన్నిక.*
అధ్యక్ష కార్యదర్శులుగా అగ్గు కిరణ్, ఆకుల నరేష్, ఉపాధ్యక్షుడు పెద్దింటి సుధాకర్, సహాయ కార్యదర్శి బండారి సత్తయ్య, కోశాధికారి సుద్దుల శంకర్,
కమిటీ సభ్యులుగా తోట సురేష్, బండారి శంకర్, ఆకుల సుభాష్, గొల్ల శ్రీనివాస్, అట్కాపురం రమేష్ లను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది.





