బాల్క సుమన్ స్థానిక అధికారులతో అత్యవసర సమావేశం
సెప్టెంబర్ 30 ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్చార్జ్ జిల్లా పెళ్లి రాజేందర్:
అక్టోబరు 1న బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మందమర్రి లోపర్యటించనున్నారు.
దానిలో భాగంగా పట్టణంలోని పార్టీ క్యాంపు కార్యాయలలో గల తన స్వగృహంలో ప్రభుత్వ విప్ బాల్క సుమన్ మున్సిపాలిటీ నాయకులు, పాలక వర్గ సభ్యులు, ఎన్నికల సమన్వయ సభ్యులు, కార్యకర్తలతో సమీక్ష సమావేశం నిర్వహించి దిశా నిర్దేశం చేశారు.
ఈ సందర్భంగా విప్ మాట్లాడుతూ అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలన్నారు. మంత్రి కేటీఆర్ పర్యటనలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులకు సూచించారు.
కార్యక్రమాన్ని కార్యాచరణ ప్రకారం సమయానికి జరిగేలా చూడాలన్నారు.
ఈ కార్యక్రమంలో బిఆర్‌ఎస్ నాయకులు, మున్సిపల్ పాలక వర్గ సభ్యులు, ఎన్నికల సమన్వయ సభ్యులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
