ప్రాంతీయం

అంతర్రాష్ట్ర చెక్ పోస్ట్ ల వద్ద పగడ్బందీ తనిఖీలు

67 Views

*రామగుండం పోలీస్ కమీషనరేట్*

*అంతరాష్ట్ర సరిహద్దు చెక్ పోస్ట్ తనిఖీ చేసిన రామగుండం పోలీస్ కమీషనర్*

*చెక్ పోస్ట్ వద్ద 24/7 పగడ్బందీగా తనిఖీలు*

*అప్రమత్తంగా ఉంటూ ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ నిర్వహించాలి: పోలీస్ కమీషనర్ శ్రీ ఎం. శ్రీనివాస్ ఐపిఎస్.,*

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సందర్బంగా కోటపల్లి మండలం రాపాన్ పల్లి అంతరాష్ట్ర సరిహద్దు చెక్ పోస్ట్ ను గత కొద్దీ రోజులుగా ఏర్పాటు చేయడం జరిగింది. ఉన్నత అధికారులు విజిట్ లో భాగంగా ఈరోజు రామగుండం పోలీస్ కమిషనర్  మంచిర్యాల డీసీపీ భాస్కర్ ఐపిఎస్., తో కలిసి అంతరాష్ట్ర సరిహద్దు చెక్ పోస్ట్ ను తనిఖీ చేసి అక్కడ విధుల్లో ఉన్న పోలీసులు అప్రమత్తంగా ఉంటూ ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయాలని రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ ఐపిఎస్., (ఐజి)  సూచించారు.

ఈ సందర్బంగా సీపీ మాట్లాడుతూ…చెక్ పోస్ట్ లో ఇద్దరు ఎస్ఐ లు పోలీస్ సిబ్బంది ఆయుధాలను కలిగి 24/7 పగడ్బందీగా అప్రమత్తంగా ఉంటూ వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ నిర్వహించి అక్రమంగా డబ్బు, మద్యం, బంగారం, ప్రజలను ప్రలోబాలకు గురి చేసే విలువైన వస్తువులు తరలిస్తుంటే పట్టుకోవడం జరుగుతుందన్నారు. ఇప్పటివరకు 4 లక్షల విలువ చేసే మద్యం ను పట్టుకోవడం జరిగింది అన్నారు. అదేవిధంగా పక్క రాష్ట్రాల నుండి ధాన్యం రవాణా కాకుండా సివిల్ సప్లై వారు చెక్పోస్ట్ ఏర్పాటు చేయడం జరిగింది. సంయుక్తంగా మహారాష్ట్ర నుండి ధాన్యం వాహనాలు వస్తే వాటిని తనిఖీ చేసి సివిల్ సప్లై అధికారుల ఆదేశాల మేరకు వాటిని తిరిగి పంపించడం జరిగింది అన్నారు. అనంతరం వాహన తనిఖీల సమయంలో వివరాలు నమోదు చేసిన రిజిస్టర్ ను పరిశీలించడంతో పాటు, వాహనాల తనిఖీల సమయంలో సిబ్బంది అప్రమత్తంగా వ్యవహారించండంతో పాటు, వాహనాలను క్షుణ్ణంగా తనిఖీలు చేయాలని సిబ్బందికి సూచించారు.

మంచిర్యాల డీసీపీ భాస్కర్ ఐపిఎస్., అడిషనల్ డీసీపీ అడ్మిన్ సి. రాజు, జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్లు, ఎస్ఐ సుబ్బారావు, వెంకట కృష్ణ,తదితరులు ఉన్నారు.

Oplus_131072
Oplus_131072
జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్