దౌల్తాబాద్: జర్నలిస్ట్ సంతోష్ సోదరుడు రాజ్ కుమార్ సిద్దిపేటలోని టెట్ పరీక్షకు వెళ్తుండగా తొగుట మండలం తుక్కాపూర్ గ్రామ శివారులో రెండు బైకులు ఎదురుగా ఢీకొని గాయపడగా విషయం తెలుసుకున్న మెదక్ ఎంపీ, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కొత్త ప్రభాకర్ రెడ్డి ఆదివారం పరామర్శించారు. ఆయన వెంట బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు రణం శ్రీనివాస్ గౌడ్, జిల్లా కోఆప్షన్ సభ్యుడు రహీముద్దీన్, గొడుగుపల్లి సర్పంచ్ శివకుమార్, దీపాయంపల్లి మాజీ సర్పంచ్ చిక్కుడు సత్యనారాయణ, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు అశోక్ గుప్తా, నాగరాజు, నాయకులు మల్లేశం, కనకరాజు, తదితరులు పాల్గొన్నారు…




