మంచిర్యాల జిల్లా
మంచిర్యాల గోదావరి రోడ్ లోని మెడికల్ కాలేజ్ ప్రాంగణంలో 23.75 కోట్ల వ్యయంతో క్రిటికల్ కేర్ ఆసుపత్రి నిర్మాణంకు ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు శంఖుస్థాపన చేశారు. శనివారం వైద్య అధికారులు, ప్రజాప్రతినిధులు తో కలిసి శంఖుస్థాపన చేసి నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే మీడియా తో మాట్లాడుతూ, మంచిర్యాల ప్రాంత ప్రజలకు ఉన్నతమైన వైద్యం అందించడానికి క్రిటికల్ కేర్ ఆసుపత్రి నిర్మిస్తున్నట్లు తెలిపారు. 50 పడకల పడకల సామర్ధ్యం గల ఆసుపత్రిలో ఎమర్జెన్సీ కేసులకు పరీక్షలు చేస్తారన్నారు.
మంచిర్యాల ను మెడికల్ హబ్ గా మారుస్తానన్న హామీని ఖచ్చితత్వం గా అమలు చేసి. పనులు ఈనెల 21వ తేదీన ప్రారభమవుతాయని తెలిపారు.రాష్ట్ర మంత్రులు దామోదర రాజనర్సింహ, దుద్దిళ్ల శ్రీధర్ బాబు హాజరవుతారని చెప్పారు. రెండున్నరేళ్ళల్లో ఆసుపత్రి నిర్మాణం పూర్తి చేస్తానని ప్రకటించి విపక్షాల విమర్శలకు తాళం వేస్తానని ప్రేమ్ సాగర్ రావు చెప్పారు.
నర్సింగ్ కాలేజ్ పనులకు శ్రీకారం
మంచిర్యాల సాయికుంట లో 40.కోట్ల తో నర్సింగ్ కాలేజ్ నిర్మాణం పనులను ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు ప్రారంభించారు. మంచిర్యాల మెడికల్ కాలేజ్ కు అనుబందంగా నర్సింగ్ కాలేజ్ నిరముంచనున్నారు. ప్రస్తుతం మార్కెట్ యార్డులో మెడికల్ కాలేజ్ పక్కన నర్సింగ్ కాలేజ్ నిర్వహిస్తున్నారు. సొంత భవనం నిర్మాణంలో సకల సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు.
గిరిజన ఆశ్రమంలో భోజనంలో రాజీ వద్దు
మంచిర్యాల సాయికుంటలోని ప్రభుత్వ గిరిజన ఆశ్రమంలో విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు. శనివారం ఆశ్రమంను సందర్శించారు. విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈసందర్భంగా విద్యార్థుల కోరిక మేరకు యాభై వేల విలువ గల వస్తువులు, ప్లేట్స్,గ్లాసులు, గిన్నెలు కొనుగోలు చేసి విరాళంగా అందజేశారు.
