-విలేకరులకు అంకితం ఇచ్చిన: రామకోటి రామరాజు
-సమాజ శ్రేయస్సు కోసం పాటుపడే వ్యక్తే విలేకరి
గజ్వేల్, నవంబర్ 16
జాతీయ పత్రికా దినోత్సవం సందర్బంగా గన్ను కన్న పెన్ను గొప్పదని అరచేతిలో కలం, మైకు పట్టుకునే చిత్రాన్ని అవాలతో అద్భుతంగా చిత్రించి నిప్పులాంటి నిజాన్ని ప్రపంచానికి తెలియజేసే విలేకరులందరికి ఈ చిత్రం అంకితం ఇచ్చిన సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణానికి చెందిన శ్రీరామకోటి భక్త సమాజం వ్యవస్థాపక, అధ్యక్షులు, భక్తిరత్న, కళారత్న, సేవారత్న అవార్డు గ్రహీత రామకోటి రామరాజు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజంలో ఆర్థిక, రాజకీయ, సామాజిక తదితర అన్ని వర్గాల అంశాలను నిష్పక్షపాతంగా సమన్వయం చేస్తూ మంచి, చెడులను ఎత్తి చూపి ఏ స్వార్థం లేకుండా సమాజ శ్రేయస్సు కోరుకునే వారే పాత్రికేయులన్నారు. నిజాన్ని నిర్భయంగా నిశ్వార్థంగా తమ గళంతో తమ కలంతో ప్రపంచానికి వినిపిస్తూ ప్రజలను చైతన్య పరుస్తూన్న మహా నీయులు పాత్రికేయులన్నారు.





