(తిమ్మాపూర్ నవంబర్ 17)
ప్రమాదవ శాత్తు వ్యవసాయ బావిలో పడి ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన తిమ్మాపూర్ మండలం గొల్లపల్లి గ్రామంలో చోటుచేసుకుంది..
కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం తిమ్మాపూర్ మండలం గొల్లపల్లి గ్రామానికి చెందిన రాచకట్ల కిషన్ (42) ప్రమాదవ శాత్తు వ్యవసాయ బావి లో పడి మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.మృతిడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.వారిది నిరుపేద కుటుంబం కావడంతో ప్రభుత్వ పరంగా అదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు..
తిమ్మాపూర్ ఎస్ఐ తాండ్ర వివేక్ సంఘటన స్థలానికి చేరుకొని మృతి దేహాన్ని రిస్క్ టీంతో బయటకి తీసి, పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు..