ప్రాంతీయం

ప్రమాదంగా మారిన రహదారులు-పట్టించుకోని సెస్ అధికారులు…

163 Views
 ముస్తాబాద్/నవంబర్/11; గురువారం రోజున బదనకల్ గ్రామం బుడగ జంగాల కాలనీలో గుర్తు తెలియని వ్యక్తులు నిర్లక్ష్యం వహిస్తూ విద్యుత్ వైర్లను స్తంభాలకు తాత్కాలికంగా అమరచడంవల్ల తెగి రోడ్డుకి అడ్డంగా పడిపోవడంవల్ల అదే గ్రామానికి చెందిన తుపాకుల సురేందర్ గౌడ్ కి విద్యుత్ వైర్లు మెడకు చుట్టుకోగా చాకచౌక్యంగా ప్రమాదం బారి నుండి తప్పించుకున్నాని తెలిపాడు. ఇలా అమాయక ప్రజలతో చలగాటం ఆడుతూ ప్రాణాలు పోయే ప్రమాదం ఉందని వరి కోత సీజన్ కారణంగా వరికోతలు ఉండడం వలన హార్వెస్టర్ డ్రైవర్లు,  రైతులు, ప్రజలు, తమ తమ వ్యవసాయ బావుల సొంత పనులకు గురించి వెళ్తున్న క్రమంలో రోడ్డుకు అడ్డంగా పడి ఉన్న వైర్లను చూసి కంగుతిన్నారు. ఇలాఉన్న విద్యుత్ వైర్లను సంబంధించిన సెస్ అధికారులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడంవల్ల ప్రమాదాల బారి నుండి తప్పించుకోవచ్చని స్థానికులు తెలిపారు. సెస్ అధికారులు నిర్లక్ష్యం వీడి వెంటనే రోడ్లపై ప్రయాణించే అమాయక ప్రజలతో చెలగాటం ఆడొద్దుని. ఇలాంటి విషయాలపైన స్థానిక నాయకులు గానీ, సెస్ అధికారులు నిర్లక్ష్యం వీడి, ప్రజల బాధ్యత భావించి తగు చర్యలు తీసుకోవాలని బంధనకల్ గ్రామస్తుడు తుపాకుల సురేందర్ గౌడ్ కోరాడు.
No Slide Found In Slider.

Poll not found
Telugu News 24/7