దౌల్తాబాద్: మండలంలో పెండింగ్ లో ఉన్న డబుల్ బెడ్ రూం లను వెంటనే పూర్తి చేసి అర్హులకు అందజేయాలని బిజెపి మండల అధ్యక్షుడు పోతరాజు కిషన్ అన్నారు. గురువారం మండల కేంద్రమైన దౌల్తాబాద్ లో దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు ఆదేశాల మేరకు తహాసిల్దార్ సుజాతకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రతి పేదవారికి ఇల్లు నిర్మించి ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వానికి రూ.2 లక్షలు నిధులను విడుదల చేసి సంవత్సరాలు గడుస్తున్న వాటిని రాష్ట్ర ప్రభుత్వం దారి మళ్లించి నిధుల దుర్వినియోగం చేపట్టిందని అన్నారు. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం నిర్మాణంలో ఉన్న ఇళ్లను త్వరగా పూర్తిచేసి లబ్ధిదారులకు అందజేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యవర్గ సభ్యులు కుమ్మరి నర్సింలు, మండల ఉపాధ్యక్షులు గడ్డమీది స్వామి, బొల్లం స్వామి, ఉప సర్పంచ్ కుమ్మరి స్వామి, నాయకులు భూపాల్ రెడ్డి, రామస్వామి గౌడ్, స్వామి, అనిల్ రెడ్డి, లక్ష్మణ్, రమేష్, శ్రీశైలం, భాను, రాజు తదితరులు పాల్గొన్నారు……
