తెలంగాణ రాష్ట్ర కబడ్డీ అసోసియేషన్ ఎన్నికలను ఆదివారం మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా బాచుపల్లిలోని, కాసాని కబడ్డీ అకాడమీలో నిర్వహించడం జరిగింది.ఈ ఎన్నికలలో సిద్దిపేట జిల్లా అధ్యక్షులు ఎన్ సీ సంతోష్, సిద్దిపేట జిల్లా కబడ్డీ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి కుంటనోళ్ళ శివ కుమార్ పాల్గొన్నారు. ఈ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర కబడ్డీ అసోసియేషన్ సంయుక్త కార్యదర్శిగా కుంటనోళ్ల శివకుమార్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు, ఈ సందర్భంగా సిద్దిపేట జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షుడు ఎన్సీ సంతోష్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర కబడ్డీ అసోసియేషన్ ఎన్నికలలో సిద్దిపేట జిల్లా కమిటీ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శికి రాష్ట్ర కార్యవర్గంలో చోటు దెక్కడం సిద్దిపేట జిల్లాకు గర్వకారణం అని అన్నారు, కబడ్డీ క్రిడాకాలను ప్రోత్సహిస్తూ అనేక జిల్లా, రాష్ట్ర స్థాయి పోటీల్లో బాధ్యత వహిస్తూ మరియు రాష్ట్ర కబడ్డీ కార్యవర్గానికి ఎప్పుడూ అందుబాటులో ఉంటూ అనేక మంది కబడ్డీ క్రిడాకారులకు చేదోడువాదోడుగా సేవలందిస్తున్నందుకు గాను తగిన గుర్తింపు తెచ్చుకున్నారని అందుకు
తెలంగాణ రాష్ట్ర కబడ్డీ అసోసియేషన్ సంయుక్త కార్యదర్శిగా కుంటనోళ్ళ శివ కుమార్ ని 33 జిల్లాల రాష్ట్ర అధ్యక్ష , ప్రధాన కార్యదర్శులు పాల్గొని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగిందని ఇది సిద్దిపేట జిల్లా గడ్డకు గర్వకారణం అని తెలిపారు ఎన్నికైన వెంటనే సిద్దిపేట జిల్లా కబడ్డీ అసోసియేషన్ కోశాధికారి సత్యం, జిల్లా ఉపాద్యక్షులు, జిల్లా సంయుక్త కార్యదర్శులు కార్యవర్గం , జిల్లా వివిధ కబడ్డీ క్లబ్ ల నిర్వాహకులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ ఎన్నికలకు ముందు తెలంగాణ రాష్ట్ర కబడ్డి అసోసియేషన్ అధ్యక్షులు కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ మరియు ప్రధాన కార్యదర్శి జగదీశ్వర్ యాదవ్,,ఆల్ ఇండియా స్పోర్ట్స్ కోడ్ నియమం నిబంధనలకు వారి వయ్యస్సు పైబడటంతో ఈ రోజు జరిగిన ఎన్నికలలో వారి స్థానాలలో నూతనంగా ఎన్నికైన తెలంగాణ రాష్ట్ర కమిటీ అసోసియేషన్ అధ్యక్షులుగా కాసాని వీరేష్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు, తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా మద్ది మహేందర్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు, కోశాధికారిగా రంగారెడ్డి జిల్లా కబడ్డీ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి రవి కుమార్ ఎన్నికయ్యారు.
