ముస్తాబాద్, మార్చి4 (24/7న్యూస్ ప్రతినిధి) పోతుగల్లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు సురభి రాధాకిషన్ రావు ఆధ్వర్యంలో విద్యార్థులచే మాక్ పోలింగ్ ప్రక్రియ చేపట్టారు. ఎన్నికల ప్రక్రియ మొదలుకొని ఓటు వేసే విధానం వరకు ప్రతి ఒక్కటి విద్యార్థులు ప్రత్యక్షంగా చేసి అవగాహన పెంచుకున్నారు. ప్రిసైడింగ్ ఆఫీసర్, పోలింగ్ ఆఫీసర్, ఏజెంట్స్ ఇలా ప్రత్యేకమైన పాత్రలు విద్యార్థులే స్వయంగా నిర్వహించారు. ఈ ఎన్నికల ప్రక్రియ అంతా సాంఘిక ఉపాధ్యాయులు జోషి సమక్షంలో నిర్వహించారు. విద్యార్థులంతా చాలా ఉత్సాహంగా పాల్గొని విజయవంతం చేశారు. ఎలక్షన్ నోటిఫికేషన్, నామినేషన్ ప్రక్రియ, స్కూటీని, గుర్తులు కేటాయించడం, ప్రచారం, ఓటింగ్ సరళి మరియు కౌంటింగ్ ఇలా ప్రతి ఒక్కటి విద్యార్థులే స్వయంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు రేష్మ సుల్తానా, భూపతి,చల్ల రాజి రెడ్డి, కృష్ణమాచారి, అలీమొద్దీన్, రమేష్, పరుశరాములు, బిక్షపతి,భారతి ఫౌండేషన్ ప్రతినిధి శ్రీ దీక్ష, హుస్నోద్దీన్, మమతలు విద్యార్థులు పాల్గొన్నారు.
