ప్రాంతీయం

వేములఘాట్ గ్రామంలో కేజీ, కేఎస్ జెండా ఆవిష్కరణ

43 Views

తెలంగాణ కల్లు గీత కార్మిక సంఘం కేజీ,కేఎస్ 67, వ వార్షికోత్సవాల సందర్భంగా ఆదివారం సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం ఆర్ అండ్ ఆర్ కాలనీ వేములఘట్ గ్రామంల కేజీకేఎస్ జిల్లా ఉపాధ్యక్షులు పల్లిపాటి కనక గౌడ్ అధ్వర్యంలో ముఖ్య అతిథిగా, తెలంగాణ కల్లుగీత కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శిబండకింది అరుణ్,హాజరై జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ‌ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ
(మల్లన్న సాగర్ ముంపు గ్రామాలైన వేములఘట్, కిష్టాపూర్, ఎర్రవెల్లి, సింగారం,పల్లెపహాడ్,తదితర గ్రామాల్లో ఉన్న కల్లు గీత కార్మికులను ఆదుకోవాలని వృత్తిలో ప్రమాద నివారణ చర్యలు చేపట్టాలి. సేఫ్టి మోకులు వృత్తి చేసేవారందరికి ఉచితంగా ఇవ్వాలి. ప్రమాదానికి గురై చనిపోయిన వారి కుటుంబాలకు, శాశ్వత వికలాంగులకు 10 లక్షలు, తాత్కాలిక వికలాంగులకు లక్ష చొప్పన ఎక్స్ గ్రేషియా నెల రోజుల లోపు ఇవ్వాలి. మెడికల్ బోర్డు విదానం తొలగించాలి. వృత్తిలో ఎక్కడ ప్రమాదం జరిగినా వర్తింప జేయాలి బెల్టు షాపులను పూర్తిగా నిషేదించాలి. కల్లులోని పోషకాలను, ఔషద గుణాలను ప్రభుత్వమే ప్రచారం చేసి మార్కెట్ సౌకర్యం కల్పించాలి. గీత కార్మికులకు ప్రస్తుతం ఇస్తున్న పెన్షన్ ఎలాంటి షరతులు లేకుండా 50 సంవత్సరాలు నిండిన ప్రతి గీత కార్మికునికి చేయూత పథకం ద్వారా 4వేలు ఇవ్వాలి. కల్లుగీత కార్మికులందరికి వృత్తికి ఉపయోగ పడే ద్విచక్ర వాహనాలు ఇవ్వాలి. రాష్ట్ర బడ్జెట్లో గీత కార్మికుల సంక్షేమానికి 5 వేల కోట్లు కేటాయించి టాడి కార్పోరేషన్ ని సమర్దవంతంగా నిర్వహించాలి. ప్రతి సొసైటికి చెట్ల పెంపకానికి 5 ఎకరాలు ప్రభుత్వ భూమి ఇవ్వాలని ఉన్న 560 జివో అమలు చేయాలి. లేదా కొనివ్వాలి. టిడిపి ప్రభుత్వం హయాంలో ఇచ్చిన 439 సొసైటీల భూములకు పెన్సింగ్ చేయించాలి. తాటి, ఈత, జీనుగు, ఖర్జూర తదితర కల్లునిచ్చే పొట్టి చెట్లు నాటాలి కల్లుగీత కార్పోరేషన్ నుండి వృత్తిలో చనిపోయిన వారి కుటుంబాలకు ఇస్తున్న తక్షణ సహాయం పెంచాలి. దహన సంస్కారాల కొరకు 50,000లు, గాయాలైన వారికి వైద్య ఖర్చుల కొరకు 25,000లు ఇవ్వాలి. నీరా,తాటి ఈత ఉత్పత్తుల పరిశ్రమలు ప్రతి జిల్లా కేంద్రంలో నెలకొల్పాలి. గౌడ యువతీ యువకులకు ఉపాది కల్పించాలి.తాటి ఈత చెట్లు నరికిన వారిపై కఠిన చర్యలు తీసుకునే విదంగా కొత్త చట్టం తీసుకరావాలి వేతన గీత కార్మికులకు అసోషియేట్ మెంబర్షిప్ ఇవ్వాలి, కనీస వేతనాలు అమలు చేయాలి, ప్రభుత్వ సంక్షేమ పథకాలు వర్తింప చేయాలి.ప్రతి గ్రామంలో కమ్యూనిటీ భవనం నిర్మించి ఇవ్వాలి ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారిలో కేజీ ,కేఎస్,జిల్లా సీనియర్ నాయకులు జిల్లా హన్మండ్లకాడి యాదగౌడ్ గ్రామ పెద్దలు మాజీ ఉప సర్పంచ్ పెద్ది బాలకిషన్ వంజరి నాగరాజు, దొడ్ల బిక్షపతి గౌడ్ దొడ్డ బాలకిషన్ గౌడ్ పల్లి పట్టి సందీప్ గౌడ్ వంగ స్వామి గౌడ్ గడ్డమీద రాజు గౌడ్ తిరుపతి గౌడ్ పల్లిపాటి అంజి గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Oplus_131072
Oplus_131072
Manne Ganesh Dubbaka