ప్రాంతీయం

మంచిర్యాల జిల్లాలో ప్రసూతి మరణాలపై సమీక్ష సమావేశం

73 Views

మంచిర్యాల జిల్లా

జిల్లా వైద్య ఆరోగ్యశాఖ మంచిర్యాల కార్యాలయంలో ప్రసూతి మరణాలు తీసుకుంటున్న చర్యల పైన సమీక్ష సమావేశం జరిగినది. ఈ సంవత్సరం జరిగిన మాతృ మరణాలపైన ఆడిట్ చేయడమైనది. బెల్లంపల్లి వేమనపల్లి నస్పూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో జరిగిన మాతృ మరణాలపైన సమీక్ష చేసి తగు సూచనలు జారీ చేయడమైనది.

ఈ క్రింది సూచనలు వైద్య సిబ్బందికి ఇవ్వడమైనది 100% గర్భవతులు నమోదు చేయాలి. వైద్యాధికారిచే పరీక్షలు చేయించాలి. 102 అమ్మఒడి అంబులెన్స్ ద్వారా స్కానింగ్ కేంద్రాలకు తీసుకుని వెళ్లి పరీక్షలు చేయించాలి హై రిస్క్ కేసులను గర్భవతులను నమోదు చేసుకుని వారానికి ఒకసారి వివరాలు తెలుసుకుంటూ ఉండాలి. పౌష్టికాహార ప్రాముఖ్యత జీవనశైలిలో మార్పులు మానసికంగా శారీరకంగా ఆరోగ్యంగా ఉండే విధంగా అవగాహన కలిగించాలి. ఆశా కార్యకర్తలు ఆసుపత్రికి ప్రసవానికి తీసుకొని వెళ్ళాలి ఎలాంటి సమస్యలున్న వైద్యాధికారికి స్త్రీ నిపుణులకు తెలియజేయాలి. అప్పుడే మనము రక్తహీనత పౌష్టికార రూపము ఇతర వ్యాధులు రాకుండా గర్భవతులను కాపాడుకోవచ్చును సాధారణ ప్రసవాలకు ప్రోత్సహించాలి, అవగాహన కార్యక్రమాలతో మాతృ మరణాలను తగ్గించవచ్చును అని డాక్టర్ కృపబ్బాయి ప్రోగ్రాం ఆఫీసర్ మాతా శిశు సంరక్షణ  తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో డాక్టర్ కృపాబాయి, ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ అరుణశ్రీ, డాక్టర్ అలివేణి,,డాక్టర్ కృష్ణవేణి, అసోసియేట్ ప్రొఫెసర్ వైద్య కళాశాల మరియు డాక్టర్ సమత, డాక్టర్ సుచరిత, వైద్యులు, వైద్య సిబ్బంది ఆశా కార్యకర్తలు, వెంకటేశ్వర్లు సిహెచ్ఓ, బుక్క వెంకటేశ్వర్ జిల్లా మాస్ మీడియా అధికారి,శ్రీమతి పద్మ డిపిహెచ్ఎన్ మరియు చారి పాల్గొన్నారు.

Oplus_131072
Oplus_131072
జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్