సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రభుత్వ దవాఖాన వద్ద ఇండియన్ మెడికల్ అసోసియేషన్ గజ్వేల్ వారి ఆధ్వర్యంలో మంగళవారం ఒకరోజు నిరాహార దీక్ష నిర్వహించారు. ఈ నిరాహార దీక్షకు మద్దతు తెలిపిన బిజెపి సీనియర్ నాయకుడు దారం గురువారెడ్డి మాట్లాడుతూ పశ్చిమ బెంగాల్ లో మహిళా డాక్టర్ పై అత్యాచారం హత్య చేసిన నిందితులను వెంటనే శిక్షించాలని డిమాండ్ చేస్తూ ఐఎంఏ ఆధ్వర్యంలో ఒకరోజు నిరాహార దీక్ష చేస్తున్న డాక్టర్లకు బిజెపి ఆధ్వర్యంలో మద్దతు తెలపడం జరిగిందని అలాగే దోషులను కఠినంగా చర్చించే వరకు డాక్టర్లు చేస్తున్న పోరాటానికి మా మద్దతు ఎప్పుడూ ఉంటుందని తెలిపారు.




