మంచిర్యాల జిల్లా
*మహారాష్ట్ర కి అక్రమంగా తరలిస్తున్న సుమారు 25 క్వింటాళ్ల పిడిఎస్ రైస్ పట్టుకొన్న టాస్క్ ఫోర్స్ పోలీసులు*
రామగుండము కమిషనరేట్ మంచిర్యాల జిల్లా సీసీసీ నస్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ రోజు టాస్క్ ఫోర్స్ సీఐ రాజ్ కుమార్, ఎస్ఐ లచ్చన్న మరియు టాస్క్ ఫోర్స్ సిబ్బంది అనుమానస్పదంగా వెళుతున్న అశోక్ లెలాండ్ వాహనాన్ని ఆపి తనిఖీ చేసి, అక్రమంగా మహారాష్ట్ర కి తరలిస్తున్న 25 క్వింటాళ్ల పిడిఎస్ రైస్ ను , వాటిని సరఫరా చేసే TS 05 UC 1578 నంబర్ గల ట్రాలి ను స్వాధీన పరుచుకొని నిందితున్ని అదుపులోకి తీసుకోవడం జరిగింది .
*పట్టుబడిన నిందితుడి వివరములు:*
సిరిగిరి సుధాకర s/o సారయ్య, వయస్సు. 21, కులం: బుడిగజంగాల, OCC . డ్రైవర్, R/O . ఎన్టీఆర్ నగర్, మంచిర్యాల.
*స్వాధీ పరుచుకున్న వాటి వివరములు :*
పిడిఎస్ రైస్ 25 క్వింటాళ్ళు వాటి విలువ సుమారు రూపాయలు 50,000/-
పట్టుబడిన వాహనాన్ని మరియు నిందితుడిని తదుపరి విచారణ నిమిత్తం సీసీ నస్పూర్ పోలీస్ స్టేషన్ వారికీ అప్పగించడం జరిగింది.
