దౌల్తాబాద్ :మండల పరిధిలోని కొనాయిపల్లి గ్రామానికి చెందిన విద్యార్థిని గొల్ల స్రవంతి బీఎస్సీ హార్టికల్చర్ పూర్తిచేసి పై చదువుల కోసం ఎంట్రెన్స్ ఎగ్జామ్స్ రాయగా తెలంగాణ రాష్ట్రంలో మూడో ర్యాంకు సాధించారు. స్రవంతి నిరుపేద కుటుంబం కాగా ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న తల్లిదండ్రులు కూలి పనిచేసి మంచి చదువులు చదివించాలని ఎన్నో ఆశలు ఉన్నప్పటికీ ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతున్నాయని తల్లిదండ్రులు వాపోతున్నారు. అమ్మాయి చదువు కోసం దాతలు ముందుకు రావాలని కోరగా దౌల్తాబాద్ ఎస్సై చైతన్య కుమార్ రెడ్డి, షాద్ నగర్ ఎస్సై చంద్రశేఖర్ రెడ్డిలు పదివేల రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందజేశారు. ఆర్థిక సహాయం అందజేసిన ఎస్ఐలకు తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు.




