ప్రాంతీయం

రాజ్యాంగమే భారతదేశ నైతిక అభివృద్ధికి దిక్సూచి

105 Views

రాజ్యాంగమే భారతదేశ నైతిక అభివృద్ధికి దిక్సూచిలాగా పనిచేస్తుందని రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత భారత పౌరుల అందరి పైన ఉందని తిరుమలాపూర్ ఎంపిటిసి బండారు దేవేందర్, దళిత వర్కింగ్ జర్నలిస్ట్ సొసైటీ దుబ్బాక నియోజకవర్గ ఉపాధ్యక్షులు పుట్ట రాజు, ఆత్మ కమిటీ డైరెక్టర్ తాడెం కృష్ణ అన్నారు. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా రాయపోల్ మండల కేంద్రంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. మండలంలోని అన్ని పాఠశాలలో రాజ్యాంగ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. అనంతరం రాజ్యాంగ ఉపోద్ఘాతం సంవిధాన దివాస్ పై ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాజ్యాంగం అమలులోకి వచ్చి 73 సంవత్సరాలు గడిచినప్పటికీ భారతదేశంలో కుల మత అసమానతలు కొనసాగడం దురదృష్టకరమన్నారు. ప్రపంచంలోనే అతి పెద్ద లిఖిత రాజ్యాంగాన్ని రచించి భారతదేశ నవ నిర్మాణానికి నాంది పలికిన ఘనత విశ్వ విజ్ఞానవేత్త బాబాసాహెబ్ అంబేద్కర్ అన్నారు. కుల మత వర్గ భేదాలు లేకుండా సమ సమాజ నిర్మాణం కోసం అంబేద్కర్జీ వితాంతం కృషి చేస్తే నేడు కొందరు వ్యక్తులు అంబేద్కర్ అంటే కొన్ని వర్గాలకే పరిమితం చేసి చిన్న చూపు చూస్తున్నారు. కానీ అంబేద్కర్ ప్రపంచానికి అర్థం అయింది ఒక తీరు, ఈ భారతదేశానికి అర్థమైంది ఒక తీరు అన్నారు. ప్రపంచం మొత్తం విజ్ఞానానికి గుర్తుగా అంబేద్కర్ ని చూస్తే మన దేశం మాత్రం ఒక వర్గానికి నాయకుడిగానే భావిస్తున్నారు. ఐక్యరాజ్యసమితి అంబేడ్కర్ జయంతిని ప్రపంచ విజ్ఞాన దివాస్ గా జరపాలని అధికారికంగా ప్రకటించిందన్నారు. ఇప్పటికీ మనదేశంలో ఆ మహనీయుడి విగ్రహాలు ధ్వంసం చేసే దుర్భర పరిస్థితుల్లో ఉండటం సిగ్గుచేటు అన్నారు. భగవద్గీత, ఖురాన్, బైబిల్ ఇలాంటి గ్రంథాలు మతాల గురించి తెలియజేయడమే కాకుండా మానవ అజ్ఞానానికి దారి తీసే విధంగా ఉంటాయి. భారత రాజ్యాంగమే సబ్బండ వర్ణాల అభివృద్ధికి దేశ ప్రజలందరికీ రక్షణగా నిలుస్తుందన్నారు. రాజ్యంగ ఫలాలు బడుగు బలహీన వర్గాలకు అందినప్పుడే దేశం సంపూర్ణ అభివృద్ధి చెందుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మండల ఉప సర్పంచ్ ల ఫోరం అధ్యక్షులు తూర్పు లక్ష్మణ్, దళిత, బహుజన సంఘాల నాయకులు నరేష్, విష్ణు, బాలకృష్ణ, నందు, స్వామి, కుమార్, సంతోష్, నర్సింలు, అర్జున్, పవన్, మహేందర్, మధు, మహేష్, రాజు జర్నలిస్టులు శ్రీనివాస్, నర్సింలు తదితరులు పాల్గొన్నారు.

Oplus_131072
Oplus_131072
Manne Ganesh Dubbaka