ప్రాంతీయం

నేత్రపర్వంగా శ్రీ శివ కేశవుల రథోత్సవాలు..

147 Views
 ముస్తాబాద్, అక్టోబర్ 17 (24/7న్యూస్ ప్రతినిధి): మండల కేంద్రంలోని శ్రీ శివ కేశవుల ఆలయాల్లో ఆలయ బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారము స్వామివారి రథోత్సవాలను రంగరంగా వైభవోపేతంగా నిర్వహించారు. వందలాదిమంది భక్తులు తరలివచ్చి స్వామివారి రథాలను కరసేవతో పురవీధుల్లో ముందుకు సాగుతూ శివ కేశవుల హరిహర నామస్మరణతో ఓరెత్తిస్తూ శోభయాత్ర నిర్వహించారు. పురవీధుల్లోకి తరలి వచ్చిన స్వామివారి రథాలకు పురస్త్రీలు మంగళ హారతులతో నిరాజనం పలికి ఊరంతా పాడిపంటలతో విరసిల్లాలని మొక్కుకున్నారు. దీనికి ముందుగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవతామూర్తులను అర్చకులు విజయసారథి పంతు రథంపై ప్రతిష్టించారు. అర్చకులు పార్థసారథి పంతులు హరీష్ శర్మ పంతులు శ్రీ ఉమామహేశ్వరుల దేవతామూర్తులను రథంపై ప్రతిష్టించారు. ఆలయ చైర్మన్ దేవయ్య, కోశాధికారి ఆగుల్ల రాజేశం, ఆలయ ప్రతినిధులు మాజీ జెడ్పిటిసి మట్ట వెంకటేశ్వర్ రెడ్డి, రాచమడుగు సంతోష రావు, దోరగొల్ల బాలయ్య, టి రాజు, కూర బిక్షపతి, కూర సంతోష్, రామచంద్రంగౌడ్, కోడె శ్రీను, కుమ్మరి రామచంద్రం, మిడిదొడ్డి శేరయ్య, నాయకులు శ్రీనివాస్ గౌడ్, ఆరుట్ల మహేష్ రెడ్డి, బండారు సత్తయ్య తదితరులు పాల్గొన్నారు.
IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

రాచర్ల గొల్లపల్లి లో సర్పంచ్ గా గెలిచేది ఎవరు...?
Telugu News 24/7