ముస్తాబాద్, ప్రతినిధి సెప్టెంబర్26. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అనేక పథకాలతో పాటు రైతులు బాగుండాలనె సంకల్పంతో రైతుబీమా, రైతుబంధు ఓవైపు అమలు చేస్తూ ఉంటే కొందరి రైతులకు తమ ఖాతాల్లో డబ్బులు పడతలేవని ఆఫీసుల చుట్టూ తిరిగి సర్వే నెంబర్లో ఉన్న భూమిని సరిదిద్దుకుని ప్రభుత్వం అందించే రైతుబంధు అందుకుందామని గంపెడు ఆశలతో వెళితే లెక్కలన్నీ ఇక పక్కాని అధికారులు నమ్మబలుకుతున్నారు. అధికారుల వల్ల రైతుల ఆశలు ఆవిరైపోతున్నాయి కానీ, వాస్తవ పరిస్థితి అందుకు భిన్నంగా ఉన్నట్టు ప్రధాన వార్త పత్రికల్లో ఆధారాలతో వార్తలు వస్తున్నాయి. భూ రికార్డులన్నీ అధికారుల తప్పిదం వల్ల తప్పుల తడకగా మారాయని పలువురు నిపుణులు చెబుతున్నారు. భూమి లెక్కలు ఆన్లైన్లో అనేక దోషాలు దొర్లాయంటున్నారు. ఒకరి భూమి మరొకరి పేరుపై చేరిన ఉదంతాలు ఉన్నాయి. ఉన్న భూమికంటే తక్కువ, ఎక్కువ లెక్కలు ఆన్లైన్లో వస్తుంటే ప్రజలు గందలగోలమైన పరిస్థితిలో మళ్లీ మధ్యవర్తుల చేతుల్లో మోసపోతున్నామని వాపోతున్నారు. వారసత్వంగా వచ్చిన భూమిని ఇతరుల నుంచి కొనుగోలు చేసినట్టు కొత్త రికార్డుల్లో చూపారనీ కొనుగోలు చేసిన భూమికి పారంపర్యంగా సంక్రమించినట్టు పేర్కొన్నారు. ఇదే అదునుగా చూసి ప్రైవేటు ఉద్యోగులు మాయమాటలు ప్రదర్శించి ద్వీ దశాబ్దాల పాటుగా ఆఫీసులలో ఉండడం మండల ప్రజల యొక్క స్థితిగతులు తెలుసుకొని అమాయక ప్రజలను ఆసరా చేసుకుని తమ ఆఫీసులకు ఏళ్ల తరబడి తిప్పుకుంటూ వారు అలసిపోయే క్రమంలో ప్రైవేట్ ఉద్యోగులు తమ చేతివాటం చూపిస్తున్నారని ఆరోపణలు తలెత్తాయి. ప్రభుత్వ పై స్థాయి అధికారికి తెలవకుండా కింది స్థాయి అధికారులు, ప్రైవేట్ ఉద్యోగులు, ప్రైవేట్ వ్యక్తులు చేయి చేయి కలుపుకొని లోలోపల గుట్టుచప్పుడు కాకుండా నడిపిస్తున్న వైనం. కాంట్రాక్ట్ ఉద్యోగులు ఏళ్ల తరబడి ఒకే ఆఫీసులో ఉండడం ఆఫీసును వ్యాపార సముదాయంగా మలుచుకున్నారంటున్నారు. ఇలాంటివారిని పట్టించుకునే వారె కరువయ్యారని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఏళ్ల తరబడి ఉన్న ప్రైవేట్ ఉద్యోగులను వేరే మండలాలకు బదిలి చేసేఉంటే ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉంటాయని పలువురు
అంటున్నారు.




