ప్రాంతీయం

గంభీరావుపేట లో 73 వ భారత రాజ్యాంగం దినోత్సవం సందర్బంగా అంబేద్కర్ విగ్రహం కు పూల మాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు

138 Views

రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలో శనివారం తెలంగాణా మాల మహా నాడు రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు దోసల చంద్రం ఆధ్వర్యంలో 73వ రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది .తెలంగాణ మాల మహానాడురాజన్న
సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు దోసల చంద్రం
మాట్లాడుతూ అంబేద్కర్ తన యొక్క దూరదృష్టితో ముసాయిదా కమిటీ చైర్మన్ గా ఉండి దాదాపు రెండు సంవత్సరాల 11 నెలల 18 రోజుల పాటు శ్రమించి, భారత రాజ్యాంగాన్ని రాసి, భారత రాజ్యాంగ సభ ముందుఉంచగా అనేక చర్చల అనంతరంభారత రాజ్యాంగాన్ని ఆమోదించి అతిపెద్ద లిఖిత రాజ్యాంగమైన మన భారతదేశ రాజ్యాంగాన్ని ఆమోదించడం జరిగింది. మన బిబిన్న సంస్కృతులు విభిన్న భాషలు విభిన్న జాతిలు ఉన్న మన దేశానికి భారత రాజ్యాంగం పరిపూర్ణమైనటు వంటి అభివృద్ధి సూచికంగా మనకు కనబడుతుంది. ప్రభుత్వాలు ఎన్ని మారిన. ప్రజాప్రతినిధుల పరిపాలన ఎలా ఉన్నా. రాజ్యాంగంమాత్రం ప్రజా శ్రేయస్సును కోరే ఒక దిక్సూచిగా ఎల్లప్పుడూ ప్రపంచానికి ఆదర్శంగా మన భారత రాజ్యాంగం నిలుస్తుంది. గొప్ప రాజ్యాంగాన్ని రచించిన మన డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ చిరస్థాయిగా భారత జాతి ఉన్నన్ని రోజులు ప్రజల గుండెల్లో మిగిలిపోతాడు. మనమందరము భారత రాజ్యాంగ సూత్రాలను మన నిజజీవితంలో అలవర్చుకొని ఉత్తమ పౌరులుగా ఎదగాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను
టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు
పాపగారి వెంకటస్వామి
మాట్లాడుతూ ఒక వార్డ్ నెంబర్ స్థాయి నుండి పార్టీ అధ్యక్షునిగా
అయినానని వెంకటస్వామి
ఆయన ఓటు హక్కు ద్వారానే నేను అనేక పదవులు అనుభవిస్తున్న అంటే అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ద్వారానే అనేక పదవులు అనుభవిస్తున్ అంబేద్కర్ ఆశయాన్ని ముందుకు తీసుకు వెళ్తానని రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయన రాసిన రాజ్యాంగం ద్వారానే నేను పదవులు పొందిన అని అంబేద్కర్ ఆశయ సాధనలో ముందు వారసలొ ఉంటానని తెలియజేయడం జరిగింది. బీఎస్పీ జిల్లా కార్యదర్శి
మారపు రాజబాబు ,
అంబేద్కర్ ఆలోచన విధానం తోటి అన్ని పార్టీలు ఆయన రాజ్యాంగం ద్వారానే నిర్మితమై ఆయన ఆశయన సాధనం కోసం ప్రతి ఒక్కరు కృషిచేయాలని కోరారు.గంభీరావుపేట గ్రామఉపసర్పంచ్
నాగరాజు
అంబేద్కర్ గారి ఆశయ సాధనలో ముందు వరుసలు ఉంటానని ఆయన మరోసారి రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ అంబేద్కర్ ఆశయాలను ముందుకు తీసుకు వెళ్తానని కొనియాడారు ఈ కార్యక్రమంలో వినోద్ కుమార్ సైన్యం జిల్లా అధ్యక్షులుఎగదండి రవి,
తెరాస పార్టీ దమ్మన్నపేట గ్రామ శాఖ అధ్యక్షులు వేణు చారి,
దోసల వికాస్ బాబు, పెండల నరసింహులు, బరిగెల అభిలాష్ , బండ దేవయ్య , బారా బాలరాజు, దోసల శ్రీకాంత్, దోసల రామచంద్రం , ఎగదండి రామస్వామి, దాసరి చంద్రం, ఎర్రోళ్ల ప్రభాకర్ , రమణ , రాజు, పిట్ల రఘు, తుడుం బాబు, తుడుం రాములు, తదితరులు పాల్గొన్నారు

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

Poll not found
Telugu News 24/7