ప్రాంతీయం

బిజెపి సభ్యత్వ నమోదు -2024 జిల్లా కన్వీనర్ గా మల్లారపు సంతోష్ రెడ్డి…

133 Views
 ముస్తాబాద్, ఆగస్టు 22 (24/7న్యూస్ ప్రతినిధి): సెప్టెంబర్ 01/2024 నుండి జరిగే బిజెపి సభ్యత్వ నమోదుకి సంబంధించి జిల్లా కన్వీనర్ గా ముస్తాబాద్ మండలానికి చెందిన మల్లారపు సంతోష్ రెడ్డిని జిల్లా అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ నియమితులుగా చేశారు. అదేవిధంగా కో కన్వీనర్లుగా సిరికొండ శ్రీనివాస్, మిరియాల్కార్ బాలాజీ, బర్కం లక్ష్మి లను నియమించారు. ఈ నియామకానికి సహకరించిన కేంద్రమంత్రులు బండి సంజయ్ కి, రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డికి ఈ సందర్భంగా మల్లారపు సంతోష్ రెడ్డి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. జిల్లా సభ్యత్వ నమోదు కన్వీనర్ గా నియమించినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. రానున్న రోజుల్లో పార్టీ అధికారంలోకి వచ్చే విధంగా జిల్లాలో అత్యధిక సభ్యత్వాలు నమోదు చేసి జిల్లాను అగ్రస్థానంలో నిలబెడతానని ఈ సందర్భంగా సంతోష్ రెడ్డి బాహాటంగా తెలిపారు.
Oplus_131072
Oplus_131072
కస్తూరి వెంకట్ రెడ్డి ఆంధ్రప్రభ ముస్తాబాద్