ప్రాంతీయం

మంచిర్యాల జిల్లా కేంద్రంలో కాకా 95వ జయంతి వేడుకలు

42 Views

మంచిర్యాల జిల్లా.

మంచిర్యాల జిల్లా కేంద్రంలోని పెద్దపల్లి ఎంపి వంశీ  క్యాంప్ కార్యాలయంలో లో పార్లమెంట్ సోషల్ మీడియా వారియర్స్ ఆధ్వర్యంలో దివంగత కాక వెంకటస్వామి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.

కాకా వెంకటస్వామి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.

అనంతరం మెగా రక్తదాన శిబిరంలో 50 మంది కి పైగా రక్తదానం చేసి 2 నిమిషాలు మౌనం తో కాక గారిని వారు చేసిన సేవలను గుర్తు చేసుకున్న సోషల్ మీడియా వారియర్స్ , కాంగ్రెస్ శ్రేణులు.

రక్త దానం చేసిన వ్యక్తులకి పండ్లు పలాలని అందించి,అనంతరం దాదాపుగా 1000 మంది తో కలిసి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.

సామాన్యుడి గుండె చప్పుడు మన కాకా
భారత దేశం కీర్తి కిరీటం ఆయన తెలంగాణ గుండె చప్పుడు ఆయన…సామాన్యుడి గుండెకాయ ఆయన తెలంగాణ కొంగు బంగారం. మన తెలంగాణ ఆత్మ గౌరవం మాజీ కేంద్ర మంత్రి వర్యులు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత హైదారాబాద్కి షాన్ దివంగత గడ్డం వెంకటస్వామి. ఇయ్యాల కాకా 95వ జయంతి .
దళిత నేతగా కాకా అంచెలంచెలుగా దేశం గర్వించే లోక నాయకుడిగా ఎదిగారు. ఆయన ఎన్నడూ నేల విడిచి సాము చయలేదు. నేల మీద ఉండి పనిచేశారు. హైదరాబాద్లో వేలాది మంది పేదల కోసం భూపోరాటం చేసి ఇంటి స్థలాలు ఇప్పించిన ఘనత కాకా వెంకటస్వామిదే. అందుకే ఆయనను గుడిసెల వెంకటస్వామి అని కూడా పిలుస్తారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమాల్లోనూ నిర్విరామంగా తన తుది శ్వాస వరకు ఉద్యమాలే ఊపిరిగా పోరాడిన యోధుడు. నిజాం పాలనను ధిక్కరించిన ధైర్యశాలి. నిరుపేదల పక్షాన నిలిచిన కార్మిక, శ్రామిక, బడుగు, బలహీన వర్గాల ప్రజల అభ్యున్నతి కోసం అనుక్షణం పోరాడిన నాయకుడు. అన్యాయం ఎక్కడున్నా వ్యతిరేకించిన నిస్వార్థుడు. గల్లీ నుంచి ఢిల్లీ వరకు అలుపెరుగని నిర్వార్థ రాజకీయ లీడర్గా చట్టసభల్లో గరిబోళ్ల గాథనలను గళమెత్తిన నినదించిన మహానేత…
దేశ వ్యాప్తంగా 101 కార్మిక సంఘాలకు కాకా నాయకత్వం వహించారు. బీఐఎఫ్ఆర్ నుంచి సింగరేణి సంస్థను కాపాడటంతో పాటు లక్ష మంది కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించిన గొప్ప లీడర్ కాకా. సింగరేణికి ఆర్థికంగా కేంద్రం నుంచి అప్పుడు రూ.1100 కోట్ల వరకు ఇప్పించారు. దేశంలో పెన్షన్ స్కీంను తీసుకవచ్చి కార్మికవర్గానికి అండగా నిలిచిన మన కాకా వెంకటస్వామి.

ఇయ్యాల స్వర్గీయ మాజీ కేంద్ర మంత్రివర్యులు గడ్డం వెంకటస్వామి(కాకా) 95వ జయంతి సందర్భంగా వారికి ఘన నివాళులు అర్పిస్తున్నాన ఆయన ఆశయ సాధనగా అందరం సాగుద్దాం.

Oplus_131072
Oplus_131072
జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్