ప్రాంతీయం

46 Views

రైతులు మేలైన విత్తనాలను ఎంచుకొని అధిక దిగుబడులు పొందాలని జననీ సీడ్స్ జోనల్ మేనేజర్ పూల శివ కోటేశ్వరరావు శనివారం రోజు రాయపోల్ మండలం అనాజిపూర్ గ్రామంలో మంగిడిపల్లి (అలియాస్ బెస్త )వెంకటేష్ అనే రైతు చేనులో జననీ సీడ్స్ వారి ఆకాష్ బిజీ 2 పత్తి విత్తనాన్ని రైతు క్షేత్ర ప్రదర్శన నిర్వహించడం జరిగింది. ఈ యొక్క పత్తి క్షేత్ర ప్రదర్శనకు వివిధ గ్రామాల నుంచి సుమారు 450 నుంచి 500 మంది రైతులకుపైగా తరలివచ్చి ఆకాష్ బిజి 2 పత్తి విత్తనాన్ని సందర్శించారు. ఆకాష్ బిజి 2 ఇంతటీ వర్షాభావ పరిస్థితులను తట్టుకొని చాలా బాగుందని రైతుల హర్షం వ్యక్తం చేశారు.ఆకాష్ ఏ పుగా పెరగడంతో అధికంగా పక్క కొమ్మలు వచ్చి కాఫు దగ్గర దగ్గరగా కాయల లావుగా ఉన్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా కంపెనీ జోనల్ మేనేజర్ పిఎస్ కోటేశ్వరరావు పాల్గొని రైతులకు ఆకాష్ బిజి 2 ప్రత్తి విత్తనంపై అవగాహన కల్పించారు. బెట్ట పరిస్థితిలోనూ పచ్చదోమ తెల్ల దోమ నుంచి తట్టుకుంటుంది అని ఆయన రైతులకు వివరించారు. గింజ శాతం ఎక్కువ ఉండి ప్రత్తి బరువు ఎక్కువ బరువు వస్తుందని, ప్రత్తి తీయడానికి బాగా సులువు ఉంటుంది ఆయన రైతులకు వివరించారు. అలాగే సాగుచేసిన రైతు మాట్లాడుతూ ఇందటి ఏడాది ఐదు ఎకరాల పొలంలో ఆకాష్ బిజి2 పత్తి విత్తనం సాగు చేయగా ఎకరాకు 18 క్వింటాళ్ల దిగుబడి వచ్చిందని, ఈ ఏడాది 7:20 ఎకరాలలో పత్తి సాగు చేయగా చేను ఏపుగా పెరిగి అధిక కొమ్మలు కలిగి ప్రస్తుతము 80 నుంచి 90 వరకు కాయలు ఉన్నట్లు 20 క్వింటాళ్ల కు పైగా దిగుబడి వస్తుందని గట్టిగా నమ్ముతున్నానని ఇంత మంచి విత్తనాలు ఇచ్చిన జననీ సీడ్స్ యాజమాన్యంతో పాటు సిబ్బందికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రీజినల్ మేనేజర్ వాసా శంకర్ రావు, డిస్ట్రిబ్యూటర్ శివశంకరి, ఫర్టిలైజర్స్ ప్రోపరేటర్ జీవన్ రెడ్డి, కంపెనీ ఏరియా మేనేజర్ నీరుడి కనకయ్య, కంపెనీ సిబ్బంది పాల్గొన్నారు.

Oplus_131072
Oplus_131072
Manne Ganesh Dubbaka