ప్రాంతీయం

శాకాంబరీ దేవి అవతారంలో అమ్మవారి దర్శనం

41 Views

-పూజలో పాల్గొన్న వేద పండితులు దేశాయి కార్తీక్ శర్మ,రమ్య దంపతులు

సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలం పాములపర్తి గ్రామంలో శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి.ఆరవ రోజు పూజలో వేద పండితులు దేశాయి కార్తీక్ శర్మ,రమ్య దంపతులు పాల్గొని ఘనంగా పూజలు నిర్వహించారు.రకరకాల కూరగాయలతో అమ్మవారిని అద్భుతంగా అలంకరించారు.అనంతరం శ్రీ శాకాంబరీ దేవి అవతారంలో అమ్మవారు దర్శనమిచ్చారు.అనంతరం తీర్థ ప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు.అమ్మవారి టోకెన్ చీర 101 రూపాయలతో టోకెన్ తీసుకుని భక్తులు అమ్మవారి కృపా కటాక్షం పొందగలరని శరావళి మాత ఉత్సవ సేవ సమితి వారు తెలిపారు.ఈ కార్యక్రమంలో శరావళి మాత ఉత్సవ సేవ సమితి సభ్యులు,గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Oplus_131072
Oplus_131072
ఎర్రోళ్ల బాబు సిద్దిపేట జిల్లా ఇంచార్జ్